వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఆపసోపాలు: కర్ణాటకలో కమలాన్ని ఎదుర్కోగలదా?

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో వొక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గాలు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. వీటి మద్దతు కోసం అధికార కాంగ్రెస్.. ప్రతిపక్షం బిజేపి.. మరో పార్టీ సెక్యులర్ జనతాదళ్ (జేడీ ఎస్) అహర్ని

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలుపొందేందుకు ఆపసోపాలు పడుతోంది. ప్రజల మద్దతు పొందే విషయమై మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలను ముందు వరుసలో నిలుపాలని పార్టీలోని ఒక వర్గం.. వొక్కలిగ సామాజిక వర్గం మద్దతు సంపాదించాలని మరో వర్గం పట్టుబడుతున్నాయి.

ప్రస్తుతం సిద్దరామయ్య క్యాబినెట్‌లో మంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు వొక్కలిగ స్ట్రాంగ్ మ్యాన్ డీకే శివకుమార్‌ను సీఎం అభ్యర్థిగా ఒక గ్రూప్ బలంగా ముందుకు తీసుకొస్తున్నది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిన మైసూర్ ప్రాంతంలోని ఆ పార్టీ నేతలు బలంగా కోరుతున్నారు. మరో జాతీయ రాజకీయాల్లో బీజేపీ.. దానికి సారథ్యం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ రాజకీయాలను శాసిస్తున్నారు.

కాంగ్రెస్, జెడి - ఎస్ పాత్రేమిటి?

కాంగ్రెస్, జెడి - ఎస్ పాత్రేమిటి?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కర్ణాటకలోనూ బీజేపీ వైరి పక్షాలుగా ఉన్న ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ జనతాదళ్ (జెడి - ఎస్) కలిసి పోటీ చేస్తాయా?.. ప్రత్యేకించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించిన తర్వాత దాని వైరి పక్షాలు కలిసి ఎదుర్కొంటాయా? లేక విడివిడిగా పోటీ చేసి మరింత బలహీనపడతాయా? అన్న సంగతి తెలియాలంటే మరికొంత సమయం వేచి చూస్తే గానీ వాస్తవ పరిస్థితి బోధ పడదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కర్ణాటకను శాసిస్తున్న వొక్కలిగ, లింగాయత్‌లు

కర్ణాటకను శాసిస్తున్న వొక్కలిగ, లింగాయత్‌లు

కర్ణాటకలో రెండు ప్రధాన సామాజిక వర్గాలు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాయి. అవి లింగాయత్, వొక్కలిగ సామాజిక వర్గాలు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బీఎస్ యెడ్యూరప్ప గతంలో సీఎంగా పని చేయడమే కాదు లింగాయత్ సామాజిక వర్గంలో ప్రభావిత శీలమైన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. లింగాయత్ సామాజిక వర్గం నేతలంతా బీజేపీకి గట్టి అండ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నంజన్‌గుడ్ ఉప ఎన్నికలో శ్రీనివాస ప్రసాద్ అభ్యర్థిత్వం పట్ల లింగాయత్ సామాజిక వర్గంలోని ఒక గ్రూప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దీన్ని బీజేపీ నేతగా యెడ్యూరప్ప యుక్తిగా పరిష్కరించగలరని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

కాంగ్రెస్ కోటలో పాగాకు బీజేపీ వ్యూహం

కాంగ్రెస్ కోటలో పాగాకు బీజేపీ వ్యూహం

వొక్కలిగ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్, హెచ్ డి దేవగౌడ సారథ్యంలోని సెక్యులర్ జనతాదళ్ (జేడీఎస్) మధ్య చీలిపోతున్నాయి. ఈ సామాజిక వర్గం ఓట్ల కోసం మధ్యలో బీజేపీ కూడా వచ్చి చేరింది. ఇటీవలే సినీ నటుడు అంబరీష్ తెర వెనుక మద్దతుతో ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ సీఎం ఎస్ఎం క్రుష్ణ కమలనాథులకు తోడయ్యారు. ఇక సెక్యులర్ జనతాదళ్ పార్టీలో పలువురు వొక్కలిగ సామాజిక వర్గం నేతలు ఉన్నారు. ఈ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే శివకుమార్ మాత్రమే ఏకైక నాయకుడు.
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు సంప్రదాయంగా పెట్టనికోటలుగా ఉన్న మైసూర్, మాండ్యా ప్రాంతాల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్నది.

జెడిఎస్, కాంగ్రెస్ పార్టీలను దెబ్బతీసేందుకు కమలనాధులు ఇలా

జెడిఎస్, కాంగ్రెస్ పార్టీలను దెబ్బతీసేందుకు కమలనాధులు ఇలా

ఒక్క రాయితో రెండు పిట్టలను దెబ్బతీసే లక్ష్యంతోనే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను దెబ్బ తీయాలని బీజేపీ భావిస్తున్నది. ఈ ప్రాంతంలో బీజేపీ క్రమంగా తమ ఓటు బ్యాంకు పెంచుకుంటున్నది. నంజన్ గూడ్, గుండ్లుపేట్ ఉప ఎన్నికల ఫలితాలు 2018 అసెంబ్లీ ఎన్నికలకు దిశా నిర్దేశం చేసే అవకాశాలేమీ లేవని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ బీజేపీ విజయం సాధిస్తే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు స్ఫూర్తి కానున్నది.

కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్న నాయకత్వ సమస్య

కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్న నాయకత్వ సమస్య

అధికార కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్య వెంటాడుతున్నది. ఒక గ్రూపు ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేయాలని వాదిస్తుంటే, మరో గ్రూప్ వొక్కలిగ ఓటర్లను విశ్వాసంలోకి తీసుకునేందుకు డీకే శివకుమార్ అభ్యర్థిత్వాన్ని ముందుకు తెస్తున్నది. తద్వారా వొక్కలిగ సామాజిక వర్గం ఓటర్లను సంఘటిత పరుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నది.

ఎస్ఎం క్రుష్ట వైదొలిగినా విజయం మాదేనంటున్న కాంగ్రెస్ పార్టీ

ఎస్ఎం క్రుష్ట వైదొలిగినా విజయం మాదేనంటున్న కాంగ్రెస్ పార్టీ

ఎస్ఎం క్రుష్ణ పార్టీ నుంచి వెళ్లిపోయినా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు జీ పరమేశ్వర ధీమా వ్యక్తం చేశారు. ‘ఎస్ఎం క్రుష్ట సీనియర్ నేత. ఆయనపైన, ఆయన వ్యాఖ్యలపైన స్పందించను. కానీ 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది' అని పరమేశ్వర ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరిగే నంజనగుడ్, గుండ్లుపేట్ అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ఎస్ఎం క్రుష్ణ ప్రభావం ఉంటుందా? లేదా? అన్న విషయమై ప్రజలు తేలుస్తారని తెలిపారు.

English summary
The Congress in Karnataka is a divided house with leadership crisis plaguing the party. While one section of the workers wants to enhance the party's minority, SC/ST, Backward Classes agenda, another faction is pushing the senior leadership to project a leader who will be able to consolidate major community votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X