వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ కమల: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఆఫర్, ఐటీ, ఏసీబీకి ఫిర్యాదు, బీజేపీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ ఆపరేషన్ కమల పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడానికి కోట్ల కోట్ల రూపాయలు ఎరవేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కమల విషయంలో ఏసీబీ, ఐటీ శాఖకు ఫిర్యాదు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్ర సీఎంతో కాంగ్రెస్ మంత్రి భేటీ, 11 మంది జంప్!కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్ర సీఎంతో కాంగ్రెస్ మంత్రి భేటీ, 11 మంది జంప్!

కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోకుండా రెండు పార్టీల నాయకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహించి చర్చలు జరుపుతున్నారు.

డీసీఎం, డీకే భేటీ

డీసీఎం, డీకే భేటీ

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్ శుక్రవారం భేటీ అయ్యి ఆపరేషన్ కమల విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ వైపు చూస్తున్న కాంగ్రెస్ మంత్రులు ఎవరు ? అని డాక్టర్ జీ. పరమేశ్వర్, మంత్రి డీకే. శివకుమార్ ఆరా తీశారని సమాచారం.

రూ. కోట్లు ఆఫర్

రూ. కోట్లు ఆఫర్

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి బీజేపీ నాయకులు కోట్ల రూపాయలు ఎరవేస్తున్నారని డాక్టర్ జీ. పరమేశ్వర్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగించడానికి సిద్దం అయ్యిందని డాక్టర్ జీ. పరమేశ్వర్ మీడియాతో అన్నారు.

 ఐటీ, ఏసీబీకి ఫిర్యాదు

ఐటీ, ఏసీబీకి ఫిర్యాదు


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మీడియాలో ప్రచారం అవుతోందని, ఇది నగదు వ్యవహారానికి సంబంధించిన విషయం కాబట్టి ఆదాయపన్ను శాఖ (ఐటీ), ఏసీబీకి ఫిర్యాదు చెయ్యాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ మీడియాకు చెప్పారు.

 11 మంది ఎమ్మెల్యేలు

11 మంది ఎమ్మెల్యేలు

అపరేషన్ కమలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారని గత వారం రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ? అనే విషయం మాత్రం రహస్యంగానే ఉంది.

ఆపరేషన్ కమల లేదు: బీజేపీ

ఆపరేషన్ కమల లేదు: బీజేపీ

ఆపరేషన్ కమలతో తాము అధికారంలోకి రావాలని ప్రయత్నించడం లేదని, ప్రతిపక్షంలోనే ఉంటామని బీజేపీ అంటోంది. కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న సమస్యలతోనే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, ప్రభుత్వాన్ని కూల్చడానికి తాము ఎలాంటి ప్రయత్నాలు చెయ్యడం లేదని బీజేపీ సీనియర్ నాయకులు అంటున్నారు.

English summary
Karnataka Deputy Chief Minister G.Parameshwara said that, Congress will file complaint against BJP to Anti Corruption Bureau (ACB) for offering money to MLA's for Operation Kamala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X