బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: బెంగళూరులో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ బ్యాన్, ఇప్పడే 70 లక్షలు, డిప్యూటీ సీఎం, బాంబ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో కాలుష్యం నివారించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చట్టం అమలులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తోంది. బెంగళూరు నగరంలో నిత్యం పెరిగిపోతున్న ట్రాఫిక్ కట్టడి చేసి ప్రజలు కాలుష్యం బారినుంచి ఊపిరి పీల్చుకోవడానికి ప్రైవేటు వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చెయ్యాలని ఆలోచిస్తున్నామని, ఈ విషయంపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని గురువారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

ఢిల్లీ దెబ్బతో నిర్ణయం

ఢిల్లీ దెబ్బతో నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల రద్దీతో కాలుష్యం పెరిగిపోయి ప్రజలు నానా ఇబ్బందులకు గురౌతున్నారని, కాలుష్యం దెబ్బతో ప్రజలు అనేక వ్యాదులతో సతమతం అవుతున్నారని డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. ఢిల్లీలో వీలైనంత వరకు వాహన సంచారం కట్టడి చెయ్యడానికి అక్కడి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో అనుసరిస్తున్న పద్దతిని బెంగళూరులో అమలు చెయ్యడానికి ప్రయత్నించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

మా టార్గెట్ అదే !

మా టార్గెట్ అదే !

ఢిల్లీలో ప్రైవేటు వాహనాల సంచారానికి అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన నియమాలు అమలులోకి తీసుకువచ్చిందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ గురువారం మీడియాకు చెప్పారు. ఢిల్లీలో ప్రైవేటు వాహనాల సంచారంపై అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బెంగళూరులో అమలు చెయ్యాలని ఇక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోందని, త్వరలో తుదినిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ స్పష్టం చేశారు.

ఐటీ, బీటీ సిటి

ఐటీ, బీటీ సిటి

ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ రద్దుకు కార్పొరేట్ కంపెనీలు, ఆ సంస్థల ఉద్యోగులు, వాహనాల డీలర్లు అంగీకరిస్తారా ? అనే ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ సమాధానం ఇచ్చారు. ఇలాగే చూస్తూ ఉంటే ఢిల్లీ కంటే బెంగళూరులో కాలుష్యం మరింత పెరిగిపోయి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటారని, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు 70 లక్షల వాహనాలు

నేడు 70 లక్షల వాహనాలు

బెంగళూరులో ఇప్పటికే 70 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయని, వాటిలో నిత్యం 75 శాతానికి పైగా సంచరిస్తున్నాయని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఇక ముందు కొత్త వాహనాల రిజిస్ట్రేన్ కు అనుమతి ఇస్తే అవి రోడ్ల మీదకు వస్తాయని, సయస్య ఢిల్లీ కంటే ఇక్కడే ఎక్కువ అవుతోందని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అంటున్నారు. ప్రజలు సంచరించడానికి ఇబ్బందులు ఎదురుకాకుండా కాలుష్యం నివారించే ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకు వస్తామని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ చెప్పారు.

సమస్యకు ఇదే మార్గం

సమస్యకు ఇదే మార్గం

బెంగళూరు నగరంలో నిత్యం వాహన సంచారం, చెత్త వస్తువులు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం తదితర సమస్యల నుంచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు కొంత కాలం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నామని, ఇంతకు మించిన మరోమార్గం కనపడటం లేదని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అంటున్నారు. ఇదే జరిగితే కొత్త కార్లు, పలు వాహనాలు కొనుగోలు చెయ్యాలని కలలుకంటున్న బెంగళూరు ప్రజలు షాక్ కు గురికావాల్సిందే.

English summary
Karnataka Deputy chief minister Dr.G. Parameshwar has reiterated that the government is thinking to impose ban on new vehicle registration in Bengaluru to curb air pollution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X