వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీ అంటే డీ: చక్రం తిప్పడానికి జయలలిత రెడి !

|
Google Oneindia TeluguNews

చెన్నై: కావేరీ నీరు తమిళనాడుకు వదిలిపెట్టమని కర్ణాటక ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్న సందర్బంలో మనం ఏమి చెయ్యాలి అని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన మంత్రి వర్గంతో, ఉన్నతస్థాయి అధికారులతో చర్చిస్తున్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా కర్ణాటక మొండి వైఖరితో న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి నిర్ణయం తీసుకుందని, ఈ విషయం తాము సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటామని తమిళనాడు ప్రభుత్వం అంటున్నది.

తమిళనాడుకు విడుదల కావలసిన కావేరీ జలాలు కచ్చితంగా వదిలి పెట్టాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. శుక్రవారం కర్ణాటక ఉబయ సభలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అని వేచి చూడాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

Karnataka defers release of Cauvery water to Tamil Nadu

అయితే గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఎవరెవరితో ఆయన సమావేశం అవుతారు ? ఏమి చర్చిస్తారు ? అని తమిళనాడు గమనిస్తున్నది. మొత్తం మీద కర్ణాటక మీద ఒత్తిడి తీసుకువచ్చి కావేరీ జలాలు విడుదల చేయించుకోవాలని తమిళనాడు నిర్ణయించింది.

అయితే తమిళనాడుకు ఎలాంటి పరిస్థితో కావేరీ నీరు విడుదల చెయ్యరాదని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. కర్ణాటక గవర్నర్ అనుమతితో శుక్రవారం అత్యవసరంగా ఉబయ సభల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సందర్బంలో ఓ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతిని కలవడానికి కర్ణాటక శాసన సభ్యులు (అఖిలపక్షం) సిద్దం అయ్యారు.

English summary
Karnataka remained largely peaceful today, and schools, colleges and offices remained open. Sporadic protests were reported from parts of Bengaluru and Mandya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X