బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో భారీ నాన్ వెజ్ పార్టీ, టన్నుల టన్నుల మాంసం, లక్షల మంది, దెబ్బకు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని కేఆర్ పురం శాసన సభ నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే (కాంగ్రెస్) తన సొంత నియోజక వర్గం ఓటర్లను ఆకర్షించడానికి భారీగా నాన్ వెజ్ పార్టీ (మాంసాహార విందు) ఇచ్చి తీవ్ర చర్చకు దారి తీశారు. దసరా పండుగ సందర్బంగా తాను నాన్ వెజ్ పార్టీ ఇస్తున్నానని, మీరు తప్పకుండా హాజరుకావాలని అనర్హత ఎమ్మెల్యే బైరతీ బసవరాజ్ ప్రజలకు మనవి చేశారు. దసరా పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన నాన్ వెజ్ పార్టీకి కేఆర్ పురం నియోజక వర్గం ప్రజలతో పాటు వివిద ప్రాంతాలకు చెందిన బైరతీ బసవరాజ్ అనుచరులు సుమారు రెండు లక్షల మంది హాజరై మాంసాహార విందు ఆరగించారు.

బీజేపీ కోర్ కమిటీలో సుమలత, ఎవరు విదేశాల్లో రౌండ్స్, మాజీ సీఎంకు పంచ్!బీజేపీ కోర్ కమిటీలో సుమలత, ఎవరు విదేశాల్లో రౌండ్స్, మాజీ సీఎంకు పంచ్!

రెండు రోజుల పార్టీ

రెండు రోజుల పార్టీ

కేఆర్ పుంర నియోజక వర్గంలోని కణ్ణూరు సమీపంలో బైరతీ బసవరాజ్ కు చెందిన కొన్ని ఎకరాల్లో ఓ లేఔట్ ఉంది. ఇదే ప్రాంతంలో బైరతీ బసవరాజ్ నాన్ వెజ్ పార్టీ ఇచ్చారు. భారీగా టెంట్ లు (గుడారాలు) వేయించిన బైరతీ బసవరాజ్ రెండు రోజుల పాటు నాన్ వెజ్ పార్టీ కోసం మాంసాహారంతో తయారు చేసిన వివిద రకాల వంటలు చేయించి ఓటర్లకు విందు ఇచ్చి వారిని ఆకర్షించారు.

బిరియాని, చికెన్ కబాబ్, చేపల ఫ్రై

బిరియాని, చికెన్ కబాబ్, చేపల ఫ్రై

సుమారు వెయ్యి మందికి పైగా వంట మనుషులు రెండు రోజుల పాటు మాంసాహారం వంటలు చేశారు. మటన్, చికెన్ బిరియానీలు, గొర్రెలు, మేకల తల, కాళ్లతో తయారు చేసిన మాంసం కూర, కాళ్ల సూప్, చేపల ఫ్రై, చెపాతీలు, రాగి ముద్ద (కర్ణాటక స్పెషల్), ఆకు కూరలు తయారు చేశారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో తన సత్తా చాటు కోవడానికి, ఓటర్లను ఆకర్షించడనాకి బైరతీ బసవరాజ్ నాన్ వెజ్ పార్టీ ఇచ్చారని సమాచారం.

టన్నులు టన్నుల మాంసం

టన్నులు టన్నుల మాంసం

దాదాపు రెండు లక్షల మంది కోసం టన్నుల టన్నుల గెర్రెలు, మేకల మాంసం, చికెన్, చేపలతో మాంసాహార వంటలు తయారు చేయించారు. ఎవరికి ఏది ఇష్టమో ఆ మాంసాహార భోజనాన్ని వడ్డించారు. బైరతీ బసవరాజ్ ఇచ్చిన నాన్ వెజ్ పార్టీ కోసం సుమారు రెండు లక్షల కోడిగుడ్లు తెప్పించి ఎగ్ ఫ్రై, ఉడక పెట్టిన గుడ్లు తయారు చేసి మాంసాహార ప్రియులకు వడ్డించారు.

సంకీర్ణ ప్రభుత్వం ఢమాల్

సంకీర్ణ ప్రభుత్వం ఢమాల్

కేఆర్ పురం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో రెండు సార్లు ఎమ్మెల్యే అయిన బైరతీ బసవరాజ్ తరువాత కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి సహకరించారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలో రావడానికి సహకరించిన బైరతీ బసరాజ్ మీద అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు.

 టిక్కెట్ గ్యారెంటీ

టిక్కెట్ గ్యారెంటీ

కేఆర్ పురంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బైరతీ బసరాజ్ కు ఇప్పటికే బీజేపీ టిక్కెట్ దాదాపుగా ఖరారైయ్యింది. అయితే సుప్రీం కోర్టులో అనర్హత ఎమ్మెల్యేల విచారణ అర్జీ పెండింగ్ ఉండటంతో ఆయన పేరును బీజేపీ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. మొత్తం మీద భారీగా నాన్ వెజ్ పార్టీ ఇచ్చిన బైరతీ బసవరాజ్ కేఆర్ పురం ఓటర్లను ఆకర్షించి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో బైరతీ బసవరాజ్ మాజీ సీఎం సిద్దరామయ్యకు ప్రధాన అనుచురిగా గెర్తింపు తెచ్చుకున్నారు. బైరతీ బసవరాజ్ సోదరుడు బైరతీ సురేష్ బెంగళూరులోని హెబ్బాళ నియోజక వర్గం ఎమ్మెల్యే.

English summary
Karnataka Disqualified MLA Byrathi Basavaraj organized huge non veg party to his KR Puram (Bengaluru) constituency people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X