బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్దలకు మాత్రమే, రూ. వెయ్యి కోట్ల ఆస్తి, ఉప ఎన్నికల ప్రచారంలో ఎంటీబీ ఐడీయా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే అసెంబ్లీ నియోజ వర్గం అనర్హత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ డిసెంబర్ లో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. దేశంలో అత్యంత శ్రీమంతుల ఎమ్మెల్యేల్లో ఒకరైన ఎంటీబీ నాగరాజ్ ఆస్తి రూ. వెయ్యి కోట్లపైగా ఉంది. అయితే తాను నిర్వహిస్తున్న గ్రామ పంచాయితీ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున రావడం లేదని గుర్తించిన ఎంటీబీ నాగరాజ్ ప్రచారంలో డిఫరెంట్ గా ప్రచారం చెయ్యాలని ఐడియా వేశారు. ప్రజలను ఆకర్షించడానికి ఎంటీబీ నాగరాజ్ టోకన్ రాజకీయాలు చేస్తున్నారు. మాజీ మంత్రి, హోస్ కోటే అసెంబ్లీ నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ప్లాన్ ఓ రకంగా ప్రజలను ఆకర్షిస్తోంది.

ఎంటీబీకి చాలెంజ్ చేసిన ట్రబుల్ షూటర్

ఎంటీబీకి చాలెంజ్ చేసిన ట్రబుల్ షూటర్

కర్ణాటకలో కాంగ్రెస్ -జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణం అయిన వారిలో ఎంటీబీ నాగరాజ్ ఒక్కరు. హోస్ కోటే నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంటీబీ నాగరాజ్ కు బీజేపీ టిక్కెట్ 99 శాతం ఖరారైయ్యింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ తదితరులు ఎంటీబీ నాగరాజ్ ను ఉప ఎన్నికల్లో ఓడిస్తామని ఇప్పటికే చాలెంజ్ చేశారు. అయితే సిద్దరామయ్య, డీకే. శివకుమార్ ను ఉప ఎన్నికల్లో ఎదుర్కోవడానికి ఎంటీబీ నాగరాజ్ సరికొత్త ప్లాన్ లతో సిద్దం అయ్యారు.

బీజేపీ రెబల్ లీడర్ గౌడ

బీజేపీ రెబల్ లీడర్ గౌడ

హోస్ కోటే నియోజక వర్గంలో బీజేపీ యువ నాయకుడు, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శరత్ గౌడ అలియాస్ శరత్ బచ్చేగౌడ ఎంటీబీ నాగరాజ్ కు పెద్ద సమస్యగా తయారైనారు. బీజేపీ టిక్కెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న శరత్ గౌడ స్వాభిమాన సభలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే యడియూరప్ప అనర్హత ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ కు బీజేపీ టిక్కెట్ ఇవ్వాలని దాదాపు నిర్ణయించారు.

ప్రజలు రాలేదని టోకన్ రాజకీయం

ప్రజలు రాలేదని టోకన్ రాజకీయం

ఇటీవల అనర్హత ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ హోసకోటే నియోజక వర్గంలో అనేక గ్రామ పంచాయితీ సభలు నిర్వహించారు. అయితే ఊహించని స్థాయిలో ప్రజలు మద్దతు ఇవ్వకపోవడం, సభలకు హాజరు కాకపోవడంతో ఎంటీబీ నాగరాజ్ షాక్ కు గురైనారు. ఎలాగైనా ప్రజలను ఆకర్షించాలని ఆలోచించిన ఎంటీబీ నాగరాజ్ టోకన్ రాజకీయాలను తెర మీదకు తీసుకొచ్చారు.

సభకు రండి టోకన్ తీసుకోండి

సభకు రండి టోకన్ తీసుకోండి

గ్రామ పంచాయితీ సభలకు హాజరౌతున్న ప్రజలకు ఎంటీబీ నాగరాజ్ టోకన్ లు పంపిణి చేస్తున్నారు. ప్రతి టోకన్ మీద MTB అని ఇంగ్లీష్ లో తన పేరును ఎంటీబీ నాగరాజ్ ముద్రించారు. MTB పేరు కింద నీటిని వృధా చెయ్యకండి బావి తరాలకు నీరు ఎంతో అవసరం అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. MTB అనే పేరు ఉన్న టోకన్ తీసుకెళ్లి షాప్ లో ఇస్తే ఉచితంగా చీరలు, దుప్పట్లు ఇస్తారని ఎంటీబీ నాగరాజ్ అనుచరులు ప్రచారం చేస్తున్నారు.

పెద్దలకు మాత్రమే !

పెద్దలకు మాత్రమే !

MTB అనే పేరు ఉన్న టోకన్ పిల్లలు తీసుకెళ్లి షాపుల్లో ఇస్తే వెనక్కి తీసుకుని ఉత్త చేతులతో వెనక్కి పంపిస్తున్నారు. MTB టోకన్ ను పెద్దలు మాత్రమే షాప్ లకు తీసుకెళ్లి ఇస్తేనే ఉచితంగా చీరలు, దుప్పట్లు ఇస్తారని ఎంటీబీ నాగరాజ్ అనుచరులు షరతులు పెట్టారు. అంతే కాదు గ్రామ సభలకు పెద్దలు మాత్రమే హాజరు కావాలని, పిల్లలు వస్తే టోకన్లు ఇవ్వమని తేల్చి చెప్పారు. మొత్తం మీద ఎంటీబీ నాగరాజ్ టోకన్ రాజకీయాలకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

English summary
Bengaluru: Karnataka Disqualified MLA (congress) MTB Nagaraju new idea to gather people to his By Election campaign. He distrubuting saree and blanket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X