బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలో కరోనా తొలి మరణం: ఆ వ్యక్తికి వైద్యం చేసిన డాక్టర్‌కు కరోనా పాజిటివ్

|
Google Oneindia TeluguNews

బెంగూళరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనావైరస్ సోకి 76 ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో కలబుర్గిలో చోటు చేసుకున్న ఈ మరణమే మనదేశంలో కరోనా తొలికేసు కావడం గమనార్హం. కలబుర్గి మృతుడు సౌదీ అరేబియా నుంచి వచ్చిన విషయం తెలిసిందే.

Coronavirus alert: కరోనా అనుమానితుల చేతికి స్టాంపు, ఎందుకంటే..?Coronavirus alert: కరోనా అనుమానితుల చేతికి స్టాంపు, ఎందుకంటే..?

కాగా, ఆ మృతుడికి వైద్యం చేసిన డాక్టర్‌కు కూడా తాజాగా కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో తన కుటుంబసభ్యులతోపాటు వైద్యుడు కూడా ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. మంగళవారం అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు కలబుర్గి డిప్యూటీ కమిషనర్ శరత్ తెలిపారు.

Karnataka doctor who treated India’s 1st patient to die of coronavirus tests positive

కర్ణాటకలో తాజా నమోదైన రెండు పాజిటివ్ కేసులలో ఈ 63ఏళ్ల డాక్టర్ కూడా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రెండు కేసులతోపాటు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరిందని వెల్లడించారు. తాజాగా కరోనా సోకిన ఇద్దర్నీ కూడా అసోలేషన్ వార్డుల్లో ఉంచినట్లు కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి బీ శ్రీరాములు తెలిపారు.

కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మాల్స్, సినిమా థియేటర్లు, స్పోర్టు స్టేడియం, పార్కులను కూడా మూసివేయాలని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రార్థనాలయాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో గుమిగూడవద్దని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు భారతదేశంలో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 7, కర్ణాటకలో రెండు, కేరళ, తెలంగాణలో ఒక్కో కేసు తాజాగా నమోదయ్యాయని కేంద్రమంత్రి వెల్లడించారు.

English summary
Karnataka doctor who treated India’s 1st patient to die of coronavirus tests positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X