• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు -ప్రమాదం లేదని గ్యారంటీ ఏది? -మరో 45లక్షల డోసులకు కేంద్రం ఆర్డర్

|

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోన్న వేళ.. కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న భారత్ బయోటెక్ తయారీ 'కొవాగ్జిన్' వ్యాక్సిన్ పై అనుమానాలు తీవ్రతరం అవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్లు తాము కొవాగ్జిన్ తీసుకోబోమని, సీరం తయారీ 'కొవిషీల్డ్' వ్యాక్సినే కావాలని డిమాండ్ చేయగా, ఇప్పుడు కర్ణాటక రెసిండెంట్ డాక్టర్లు సైతం 'కొవాగ్జిన్'పై విముఖత ప్రదర్శిస్తూ, దాని సేఫ్టీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి సంచలన లేఖ రాశారు...

కన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనాకన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనా

 భారత్ బయోటెక్ హెచ్చరించినా..

భారత్ బయోటెక్ హెచ్చరించినా..

కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా భారత ప్రభుత్వం దేశంలో అత్యవసర వినియోగానికిగానూ రెండు వ్యాక్సిన్లను ఆమోదించింది. మొదటిది సీరం ఇనిస్టిట్యూట్ భాగస్వామిగా ఉన్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ వర్సిటీల తయారీ ‘కొవిషీల్డ్'కాగా, రెండోది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్'. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీలో కేంద్ర సంస్థల సహకారం ఉండటంతో దానిని ప్రభుత్వ వ్యాక్సిన్ గానే చాలా మంది భావిస్తున్నారు. అయితే, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించకముందే కొవాగ్జిన్ ను వాడకానికి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాక్సినేషన్ ఇప్పటికే కొనసాగుతుండగా, పలు చోట్ల కొవాగ్జిన్ టీకాలపై అనుమానాలు, అపోహలు వ్యక్తమయ్యాయి. దీంతో భారత్ బయోటెక్ సంస్థ మంగళవారం కీలక హెచ్చరికలు జారీ చేసింది..

 కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు..

కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు..

జ్వరంతో బాధపడుతోన్నవారు, గర్భిణులు లేదా బాలింతలు, అలర్జీ సమస్యలు ఉన్నవారంతా కొవాగ్జిన్ టీకాను తీసుకోకుండా ఉండటమే మంచిదంటూ భారత్ బయోటెక్ మంగళవారం ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీలోని పలు ఆస్పత్రుల డాక్టర్లు కొవాగ్జిన్ టీకాను తీసుకోబోమంటూ ప్రకటనలు చేయగా, తాజాగా కర్ణాటక రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్(కేఏఆర్‌డీ) సైతం తాము ఆ వ్యాక్సిన్ ను తీసుకోబోమని కరాకండిగా చెప్పేసింది. కొవాగ్జిన్ టీకా తీసుకుంటే ప్రమాదం ఉండబోదని నిర్ధారించే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను తక్షణమే విడుదల చేయాలని, పూర్తి డేటా లేకపోతే.. కనీసం అందుబాటులో ఉన్న డేటానైనా వెల్లడించాలని కేఏఆర్‌డీ డిమాండ్ చేసింది. అంతేకాదు..

 వ్యాక్సిన్‌పై సర్కారుకు డాక్టర్ల డిమాండ్లు..

వ్యాక్సిన్‌పై సర్కారుకు డాక్టర్ల డిమాండ్లు..

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 237 సెంటర్లలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే అందులోని ఆరు సెంటటర్లలో మాత్రం కేవలం కొవాగ్జిన్ టీకాలనే అందుబాటులో ఉంచారు. చిక్ మంగళూరు, హసన్, బళ్లారి, శివమొగ్గ, చామరాజనగర్, దావణగెరె జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం కొవాగ్జిన్ టీకాలను మాత్రమే ఇస్తుండటంపై రెసిడెంట్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వానికి డాక్టర్లు మంగళవారం రాసిన లేఖలో మూడు డిమాండ్లను ఉంచారు. అవి..

కొవాగ్జిన్ పై అనుమానాలు.. అయినా బోలెడు ఆర్డర్లు

కొవాగ్జిన్ పై అనుమానాలు.. అయినా బోలెడు ఆర్డర్లు

1)భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ డేటాను(కనీసం మధ్యంతర విశ్లేషణలైనా) వెల్లడించాలని.. 2)భత్రత, సమర్థత ఉన్న వ్యాక్సిన్లను మాత్రమే సరఫరా చేయాలని, 3)అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లలో ఏ డోసు కావాలనే ఛాయిస్ ను తీసుకునే వారికే కల్పించాలని కర్ణాటక డాక్టర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కొవాగ్జిన్ పై వైద్యులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. భారత్ బయోటెక్ కంపెనీకి ఆర్డర్లు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే 55 లక్షల డోసుల్ని కొనుగోలు చేసిన కేంద్రం.. కొత్తగా మరో 45లక్షల కొవాగ్జిన్ డోసులు కావాలని లేఖ రాసినట్లు తెలుస్తోంది. వాటిలో 8 లక్షల డోసుల్ని భారత్.. పొరుగున ఉన్న మిత్ర దేశాలకు సరఫరా చేయనుంది. భారత్ బయోటెక్ స్వచ్ఛందంగా మరో 16 లక్షల డోసుల్ని ప్రభుత్వానికి ఉచితంగా అందివ్వనుంది.

తమిళనాడు: శశికళ దెబ్బకు జయ పార్టీ బేజారు - అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం -సీఎంగా స్టాలిన్తమిళనాడు: శశికళ దెబ్బకు జయ పార్టీ బేజారు - అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం -సీఎంగా స్టాలిన్

English summary
A large number of resident doctors in six districts of Karnataka have voiced their objection to taking the Covaxin shot developed by Hyderabad-based Bharat Biotech and have asked the government to use the Covishield vaccine instead. this comes after resident doctors at Delhis RML Hospital raised similar concerns following the launch of Indias vaccine drive and said they would prefer to get the Covishield vaccine instead of Covaxin. The Karnataka Association of Resident Doctors (KARD) has demanded the state government to allow healthcare workers to choose the Covid-19 vaccine that will be administered to them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X