వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏబీపీ-సీఎస్‌డీఎస్ సర్వే: కర్నాటకలో హంగ్, కాంగ్రెస్‌కు 97, బీజేపీకి 84, లింగాయత్‌లు బీజేపీకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు రోజులు ఉంది. ఈ సమయంలో తాజాగా మరో సర్వే విడుదలయింది. ఐబీపీ న్యూస్ - సీఎస్‌డీఎస్ ఒపీనియన్ పోల్ సర్వేలో హంగ్ వస్తుందని తేలింది. ఏయే పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయో ఈ సర్వే వెల్లడించింది.

బీజేపీకి 84 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 97 సీట్లు, జేడీఎస్‌కు 37 సీట్లు, ఇతరులకు 4 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. మేజిక్ ఫిగర్ 113. అంటే ఏ పార్టీకి కావాల్సిన మెజార్టీ రాదని సర్వే వెల్లడించింది.

Karnataka election: Congress to be Single-largest party in hung assembly, predicts survey

కాంగ్రెస్ పార్టీకి 38 శాతం, బీజేపీకి 33 శాతం, బీఎస్పీతో జతకట్టిన జేడీఎస్‌కు 22 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని 40 శాతం రైతాంగం సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉంటే, బీజేపీకి 31 శాతం అనుకూలంగా ఉంది.

కాంగ్రెస్ పాలనతో తాము సంతృప్తిగా ఉన్నామని 29 శాతం మంది చెబితే, 43 శాతం మంది పర్వాలేదన్నారు. లింగాయత్‌లకు ప్రత్యేక మతం అంటూ కాంగ్రెస్ చేసిన విభజన వాదం పనికి వచ్చేలా కనిపించడం లేదు. 61 శాతం లింగాయత్‌లు బీజేపీకే ఓటు వేస్తామని చెప్పారు.

English summary
Karnataka Assembly Elections 2018 : ABP news Lokniti CSDS Opinion Poll is out. This is the second opinion from ABP news and it predicted a Hung assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X