వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్మకం ఉంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి: బిజెపికి శివసేన సవాల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఈవీఎంలపై నెలకొన్న సందేహలను తీర్చాలని డిమాండ్ చేశారు.

ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రే ఈ సవాల్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కూడ సమర్ధించారు.

Karnataka Election Result 2018: Uddhav Thackeray calls it EVMs victory, asks BJP to fight polls with ballot papers

కర్ణాటకలో బిజెపికి వచ్చిన సీట్లు ఈవీఎంల ద్వారా వచ్చినవని ఆయన చెప్పారు. ఈ విజయం ఈవీఎంల విజయమేనని ఆయన ఎద్దేవా చేశారు. బిజెపి ఉప ఎన్నికల్లో ఓటమి పాలౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధిస్తోన్న విషయాన్ని ఆయన గుర్త చేశారు.

మీ మీద మీకు నమ్మకం ఉంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని శివసేన చీఫ్ ఉద్దర్ ఠాక్రే డిమాండ్ చేశారు.

చాలామంది బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

English summary
Shiv Sena chief Uddhav Thackeray on Tuesday challenged the BJP to hold elections through ballot papers to clear doubts over the use of electronic voting machines (EVMs)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X