వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఉప ఎన్నికలు: నాలుగింట కాంగ్రెస్-జేడీఎస్ గెలుపు, బీజేపీకి భారీ షాక్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. మూడు లోకసభ, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను ఈ కూటమి గెలుచుకుంది. బళ్లారి లోకసభ బీజేపీ సిట్టింగ్ స్థానం. దీనిని బీజేపీ కోల్పోయింది. ఇది బీజేపీకి పెద్ద షాక్.

బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోకసభ ఎన్నికల్లో, జామ్‌కండి, రామనగర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. గత శనివారం నాడు ఉప ఎన్నికలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Karnataka By Election Results 2018: JD(S)-Cong maintains steady lead over BJP

- శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర గెలిచారు.

- బళ్లారి లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప గెలిచారు.

- జామ్‌కండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ సిద్దూ న్యామగౌడ విజయం సాధించారు.

- రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి విజయం సాధించారు.

- మాండ్య లోకసభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి శివరామగౌడ విజయం సాధించారు.

- శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర ముందంజలో ఉన్నారు. రాఘవేంద్ర.. యడ్యూరప్ప తనయుడు.

- రెండు లోకసభ, రెండు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్-జేడీఎస్‌లు ముందంజలో ఉన్నాయి. శివమొగ్గలో బీజేపీ ముందంజలో ఉంది.

- ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి పోటీ చేశాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది.

- మాండ్య, రామనగరలో జేడీఎస్‌ అభ్యర్థులు శివరామె గౌడ, అనిత కుమారస్వామి బరిలోకి దిగారు. బళ్లారి, జామ్‌ఖండీలో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉగ్రప్ప, ఆనంద్‌ న్యామగౌడ్‌ పోటీలో ఉన్నారు. బళ్లారిలో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ శ్రీరాములు సోదరి శాంత బరిలో నిలిచారు.

English summary
It is a prestige test for the JD(S)-Congress alliance in Karnataka. Counting of votes in the Karnataka by-polls will begin shortly. By-elections were held for the three Lok Sabha and two assembly constituencies on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X