వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో ఊహించని ట్విస్టులు: ఢిల్లీకి మారిన సీన్, యడ్యూరప్పకు తాత్కాలిక ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చక్రం తిప్పుతున్నాయి. కింగ్ లేదా కింగ్ మేకర్‌గా మొదటి నుంచి భావిస్తున్న జేడీఎస్‌లో చీలికలు వచ్చే పరిస్థితి దానికి తోడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.

చదవండి: అర్ధరాత్రి హైడ్రామా, బీజేపీకి సుప్రీం కోర్టులో ఊరట, యడ్డీ ప్రమాణ స్వీకారం

Karnataka election results 2018 LIVE:  kumara swamy elected as jdss legislative party leader

Newest First Oldest First
9:09 AM, 17 May

కర్నాటక 23వ సీఎంగా యడ్యూరప్ప గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.
8:45 AM, 17 May

...ప్రమాణ స్వీకారం అనంతరం సభలో విశ్వాస తీర్మానం ఏ రోజు ప్రవేశ పెడతారో (బలం నిరూపించుకోవడం) వెల్లడించనున్నారు.
8:44 AM, 17 May

... యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి అమిత్ షా, నరేంద్ర మోడీ హాజరు కావడం లేదు. యెడ్డీ 3వసారి సీఎంగా ప్రమాణం చేస్తున్నారు.
8:44 AM, 17 May

... యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి అమిత్ షా, నరేంద్ర మోడీ హాజరు కావడం లేదు. యెడ్డీ 3వసారి సీఎంగా ప్రమాణం చేస్తున్నారు.
8:43 AM, 17 May

... యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి అమిత్ షా, నరేంద్ర మోడీ హాజరు కావడం లేదు.
8:42 AM, 17 May

యెడ్డీ ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో రాజ్ భవన్‌కు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వారు వందేమాతరం, మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు.
8:41 AM, 17 May

కర్నాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు యెడ్డీ రాజ్ భవన్ బయలుదేరారు.
8:41 AM, 17 May

యెడ్డీ ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన రాజ్ భవన్ వేదిక
7:56 AM, 17 May

సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాల నేపథ్యంలో యడ్డీ ఇంటి వద్ద సందడి నెలకొంది.
7:55 AM, 17 May

యడ్డీ ప్రమాణ స్వీకారానికి మురళీధర రావు, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా హాజరవుతున్నారు.
7:52 AM, 17 May

ఆయనను ఆశీర్వదించేందుకు వేదపండితులు వచ్చారు.
7:51 AM, 17 May

యడ్యూరప్ప కాసేపట్లో రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
7:45 AM, 17 May

కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఓ రిసార్టులో ఉంచారు. యడ్యూరప్ప తన బలం నిరూపించుకునే వరకు వారిని అక్కడే ఉంచనున్నారు. రిసార్టులోని ఎమ్మెల్యేల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
7:44 AM, 17 May

రాజ్ భవన్ వద్ద ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి.
7:44 AM, 17 May

యడ్యూరప్ప తొమ్మిది గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో యడ్యూరప్ప నివాసం వద్ద పరిస్థితి ఇలా ఉంది.
6:12 AM, 17 May

గవర్నర్‌కు ఇచ్చిన లేఖను (మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కూడిన జాబితా) తమకు ఇవ్వాలని సుప్రీం కోర్టు యడ్యూరప్పకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
5:55 AM, 17 May

అనంతరం న్యాయస్థానం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే విధించడానికి నిరాకరించింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయం పది గంటలకు వాయిదా వేసింది.
5:55 AM, 17 May

బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, గురువారం వేకువజామున రెండు గంటల నుంచి ఉదయం ఐదున్నర గంటల వరకు ఇరువైపుల వాదనలు విన్నది.
5:54 AM, 17 May

యెడ్డీని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడంతో కాంగ్రెస్ - జేడీఎస్ సుప్రీం కోర్టుకు వెళ్లింది.
10:23 PM, 16 May

గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల సమయం ఇవ్వడం ద్వారా హార్స్ ట్రేడింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని కుమారస్వామి అన్నారు.
10:14 PM, 16 May

గవర్నర్ తీరు సరికాదని సుర్జేవాలా అన్నారు.
10:14 PM, 16 May

అమిత్ షాను ఒక్క మాట అడగాలనుకుంటున్నాం.. ఎన్నికల అనంతరం పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దనుకుంటే గోవా, మణిపూర్‌లలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీని కాదని ఇతర ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో చెప్పాలని సుర్జేవాలా ప్రశ్నించారు.
10:13 PM, 16 May

యడ్డీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధ రణ్‌దీప్ సుర్జేవాలా స్పందించారు.
10:02 PM, 16 May

ఏ పార్టీ అయితే ఎన్నోసార్లు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందో, ఏ పార్టీ అయితే ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన విధించిందో అలాంటి పార్టీ మాకు నీతులు చెబుతోందని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ ఎద్దేవా చేశారు.
10:00 PM, 16 May

యడ్యూరప్ప రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని, ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని, బలం నిరూపించుకున్న తర్వాత కేబినెట్ విస్తరిస్తారని మురళీదర రావు చెప్పారు.
9:45 PM, 16 May

యడ్యూరప్ప గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని, మెజార్టీ నిరూపించుకునేందుకు 15 రోజుల సమయం ఇచ్చారని బీజేపీ నేత బస్వరాజు బొమ్మాయి వెల్లడించారు.
9:44 PM, 16 May

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ బీజేపీ శాసన సభా పక్ష నేత యడ్యూరప్పను ఆహ్వానించారు.
9:43 PM, 16 May

యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికారికంగా గవర్నర్ నుంచి లేఖ అందింది.
9:43 PM, 16 May

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
9:05 PM, 16 May

కర్ణాటక రాజకీయంలో మరో ట్విస్ట్. రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారన్న ట్వీట్‌ను బీజేపీ తొలగించింది.
READ MORE

English summary
The big day that all of us were waiting for is here. Who is set to win Karnataka? Will it be a clear mandate of will it result in a hung assembly. Almost all exit polls have suggested a hung house. Will the pollsters be proven right?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X