వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక రిజల్ట్స్: బిజెపికే జై కొట్టిన తెలుగు ఓటర్లు, తెలంగాణ, ఏపీలే కమలం టార్గెట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: దక్షిణాదిలో పాగా వేసే క్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజారిటీకి 8 సీట్ల దూరంలో బిజెపి నిలిచిపోయింది. రానున్న రోజుల్లో బిజెపి ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కేంద్రీకరించే అవకాశం ఉంది.

కర్ణాటక రాష్ట్రంలోని హైద్రాబాద్- కర్ణాటక రీజియన్‌లో సుమారు 31 సీట్లున్నాయి. ఇందులో బిజెపి 12 సీట్లు కైవసం చేసుకొంది. 2013 ఎన్నికల్లో ఈ రీజియన్ లో బిజెపికి కేవలం 6 సీట్లు మాత్రమే దక్కాయి. కానీ, ఈ సారి అనుహ్యంగా బిజెపికి 12 సీట్లు దక్కించుకొంది.

Karnataka Election Results: After Telugu Voters Opt for BJP in Karnataka, Andhra Pradesh and Telangana Next on Rada

కర్ణాటక రాష్ట్రంలో సుమారు 15 శాతం తెలుగు మాట్లాడే ప్రజలు ఉంటారు. 12 జిల్లాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బెంగుళూరు సిటీ, బెంగుళూరు రూరల్, చికుబల్లాపూర, తుముకూరు, చిత్రదుర్గ,బళ్ళారి, కొప్పల్, రాయిచూర్, కొలబారి, యాద్గిర్, బీదర్ ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

హైద్రాబాద్ కర్ణాటక జిల్లాల్లో ముస్లిం జనాభా కూడ గణనీయంగా ఉంటుంది. వీరంతా చారిత్రకంగా , సంస్కృతి పరంగా తెలంగాణతో సంబంధాలు కలిగి ఉన్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు బిజెపికి వ్యతిరేకంగా ఓటు చేయాలని ప్రచారం చేశారు

. కానీ, హైద్రాబాద్- కర్ణాటక ప్రాంతంలో ఓటర్లు బిజెపికి సానుకూలమైన సంకేతాలను ఇచ్చారు. గతం కంటే మెరుగైన రీతిలో సీట్లను కట్టబెట్టారు. ఇది బిజెపి నాయకత్వానికి అనుకూలమైన పరిణామం.

ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చిన తర్వాత ఏపీకి న్యాయం చేయలేదని మోడీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు చేస్తున్న తరుణంలో బిజెపికి అధికంగా సీట్లు రావడం ప్రాధాన్యత కలిగిస్తోంది.

కర్ణాటకలో బిజెపిని దెబ్బకొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్ని రకాల వ్యూహలను ప్రయోగించారు.కానీ, తెలుగు ప్రజలు బిజెపికి పట్టం కట్టి బాబు రాజకీయాలను తిరస్కరించారని బిజెపి నేత రామ్ మాధవ్ అభిప్రాయపడ్డారు.

English summary
The chances of BJP forming a new government in Karnataka are looking bleak now. Yet, the party has started its dominance down south. And next in the BJP’s plans could be the states of Andhra Pradesh and Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X