వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీకే పట్టం, రెండో స్థానంలో కాంగ్రెస్
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసన నేపథ్యంలో మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. కొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెబుతుండగా, మరికొన్ని సంస్థల బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలబడుతుందని వెల్లడిస్తున్నాయి.
తాజాగా, రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ కూడా కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరిస్తుందని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఇప్పుడు ఆ అవకాశం లేదు.

రిపబ్లిక్ టీ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
బీజేపీ: 95-114 సీట్లు
కాంగ్రెస్: 73-82 సీట్లు
జేడీఎస్: 32-43 స్థానాలను గెల్చుకోనున్నట్లు వెల్లడించింది.
ఇతరులకు 2-3 స్థానాలు లభిస్తాయని పేర్కొంది.