వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఎన్నికలు: హంగ్ వస్తే జెడి(ఎస్) ఎటు, కింగ్ మేకర్ పాత్రేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: వచ్చే నెల 12వ తేదిన కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే జెడి(ఎస్) కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశం ఉంది.ఇటీవల వెలువడిన సర్వే ఫలితాలు హాంగ్ అసెంబ్లీ దిశగా ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జెడి(ఎస్) కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో జైన్ సర్వే ఫలితాలను వెల్లడించింది. అయితే కర్ణాటకలో బిజెపి అతి పెద్ద పార్టీగా ఈ ఎన్నికల్లో విజయం నిలువనున్నట్టు ఈ సర్వే ప్రకటించింది. అయితే ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మెజార్టీ దక్కకపోవచ్చని భావిస్తున్నారు.ఇదే జరిగితే ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో జెడి(ఎస్) పాత్ర కీలకంగా మారే అవకాశం లేకపోలేదు.

Karnataka elections: Who will JD(S) back in case of a hung house?

హంగ్ అసెంబ్లీ ఏర్పాటైతే రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనే దానిపై కర్ణాటక రాష్టరంలోని రాజకీయ విశ్లేషకులు సందీప్ శాస్త్రి తన అబిప్రాయాలను వెల్లడించారు. ఈ మేరకు ఆయన వన్ ఇండియాతో మాట్లాడారు.

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 అసెంబ్లీ సీట్ల మేజిక్ ఫిగర్‌కు చేరుకోవాలి. అయితే ఈ మేజిక్ ఫిగర్‌కు చేరువలో ఉన్న ఏ పార్టీ ఉందనే విషయంతో పాటు, స్వతంత్ర అభ్యర్దులను బట్టి జెడి (ఎస్) నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదని డాక్టర్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. జెడి(ఎస్)ను ఒప్పించడం కంటే స్వతంత్రులను ఒప్పించడం సులభమని ఆయన చెప్పారు.

ఒకవేళ జెడి (ఎస్)ను బిజెపి మద్దతు కోరితే, అది జాతీయ రాజకీయాలను బట్టే ఉంటుందని డాక్టర్ శాస్త్రి చెప్పారు. ఒకవేళ జెడి(ఎస్) అంచనాలే నిజమైతే దీన్ని ఆ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది.ఈ సమయంలో దేవేగౌడ పెద్ద కొడుకు డాక్టర్ రేవన్నను డిప్యూటీ సీఎంగా పెట్టాలని జెడి(ఎస్) ప్లాన్‌గా చేసే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి బిజెపి ఒప్పుకోనందునే డిప్యూటీ సీఎం పదవిని తీసుకొనే అవకాశం లేకపోలేదని ఆయన భావిస్తున్నారు.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఆధిక్యంలో ఉంటే ఇప్పటికే ఆ పార్టీ బిబిఎంపీతో పొత్తుతో ఈ ఎన్నికల్లో పోటీలో ఉంది. జెడి(ఎస్) జాతీయ రాజకీయాలకు అనుగుణంగా పొత్తు కుదిరే అవకాశం లేకపోలేదన్నారు. ఒకవేళ అదే జరిగితే సీఎం సిద్దరామయ్యకు ఇది నష్టమని డాక్టర్ శాస్త్రి అభిప్రాయపడ్డారు.సిద్దరామయ్యను సీఎంగా చేయడానికి జెడి(ఎస్) ఒప్పుకోకపోవచ్చని డాక్టర్ శాస్త్రి చెప్పారు.

ఈ రకమైన అవకాశం కోసం చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడ ఎదురుచూస్తున్నారు. ఇది వారికి అందివచ్చిన వరంగా మారే అవకాశం లేకపోలేదని డాక్టర్ శాస్త్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

English summary
The heat is on and the big question who will conquer Karnataka. A recent survey conducted JAIN- A deemed to be university and Lokniti, CSDS has said that the BJP will emerge as the single largest party, but no party will get a clear verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X