వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వక్కలతో రుచికరమైన ఊరగాయలు, ఇంజనీరింగ్ విద్యార్థి ప్రయోగం, ఆరోగ్యానికి !

|
Google Oneindia TeluguNews

Recommended Video

వక్కలతో రుచికరమైన ఊరగాయలు, ఇంజనీరింగ్ విద్యార్థి ప్రయోగం

బెంగళూరు: మామిడి కాయ, ఆవకాయ, టమోటో, నిమ్మకాయ, కీరకాయ, నల్లికాయ, ఉల్లిపాయ, తెల్లగడ్డ, కాకరకాయతో పాటు వివిద రకాల ఉరగాయలను మనం చూశాం. మాంసాహారంలో చేపలు, చికెన్, మటన్, రోయ్యలతో ఉరగాయలు తయారు చేస్తారు. అయితే ఇంజనీరింగ్ విద్యార్థి వక్కలతో రుచికరం అయిన ఊరగాయలు తయారు చేశాడు. వక్కల ఊరగాయ ఆరోగ్యానికి హానికరం కాదని అంటున్నాడు.

వక్కలు ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం అంటోంది. వక్కలను ఎక్కువగా పాన్ మసాలా, పాన్ పరాగ్, గుట్కాలకు ఉపయోగిస్తుంటారు. వక్కలు ఆరోగ్యనికి హానికరం అని ప్రచారం జరగడంతో వక్కతోటలు పెంచుకుంటున్న రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

 Karnataka Engineering student introduced unique pickle from Areca nut

వక్కలు ఆరోగ్యానికి హానికరం కాదని మంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అంటున్నాడు. వక్కలతో ఊరగాయ తయారు చేసి తననైపుణ్యం చాటుకున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థి. మంగళూరు ఇంజనీరింగ్ కాలేజ్ లో నిఖిల్ అనే యువకుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు.

ఇతను ఉక్కలతో ఉరగాయ తయారు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వక్కలతో ఉరగాయ తయారు చెయ్యడం చాల సులభం అని నిరూపించాడు. పచ్చి వక్కలు ముక్కలు చేసి 15 రోజుల పాటు ఉప్పు నీటిలో వాటిని పెట్టాలి.

 Karnataka Engineering student introduced unique pickle from Areca nut

ఉప్పు నీటిలో ఉన్న వక్క ముక్కలు బయటకు తీసిన తరువాత కొత్తిమీర, జిలకర, మెంతిపొడి, జిలకర వేసి కలపాలి. తరువాత మామిడికాయ ఉరగాయ ఎలా తయారు చేస్తారో అలాగే వక్కల ఊరగాయ తయారు చేశాడు ఇంజనీరింగ్ విద్యార్థి నిఖిల్.

నిఖిల్ తండ్రి రైతు. గతంలో ఆయన వక్కల కాషాయం పొడి, చాక్లెట్లు తయారు చేశారు. ఇప్పుడు తండ్రి బాటలో నిఖిల్ కూడా పయనిస్తున్నాడు. వక్కల వాసన రాకుండా ఐదు రోజులు, 10 రోజులు, 15 రోజులు ఉప్పు నీటిలో నానపెట్టి ఊరగాయలు తయారు చేస్తున్నాడు.

వాటిలో ఏది రుచికరంగా ఉంటుందో వాటిని మార్కెట్ లోకి తీసుకువస్తామని నిఖిల్ అంటున్నాడు. రానున్నరోజుల్లో వక్కలతో బర్ఫీలు ఎలా తయారు చెయ్యాలి అనే ప్రాజెక్టుతో తాను పరిశోధన చేస్తున్నానని, వక్కలతో మరన్ని ఆహారఉత్పత్తులు తయారు చెయ్యడానికి అగ్రీ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ సంస్థను ఏర్పాటు చేస్తానని నిఖిల్ అంటున్నాడు.

English summary
Areca nut plays significant role in livelihood of the farmers. Areca famous only as by product for preparation of Gutka and other pan masalas. But now Managaluru Engineering student Nikhil introduced unique pickle from Areca nut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X