బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నాటక ఎగ్జిట్ పోల్స్: 5 బీజేపీకి, 2 కాంగ్రెస్‌కు, ఎవరికీ మెజార్టీ రాకున్నా జేడీఎస్ ఆశలు గల్లంతేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళిని పరిశీలిస్తే హంగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు సర్వేలు మినహా... ఏ సర్వేలోను ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అయితే, ఎక్కువ సర్వేలు బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని చెబితే, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించాయి.

ఆయా ఫలితాలను బట్టి అయితే జేడీఎస్ లేదా స్వతంత్రులు కూడా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 224 స్థానాలకు గాను 222 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే మృతి కారణంగా జయా నగర్‌లో ఎన్నిక రద్దయింది. వేలాది ఫేక్ ఓటరు ఐడీ కార్డులు బయటపడటంతో ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నిక మే 28వ తేదీకి వాయిదా పడింది. ఇదిలా ఉండగా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఎక్కువ ఎగ్జిట్ సర్వేలు హంగ్ వైపే

ఎక్కువ ఎగ్జిట్ సర్వేలు హంగ్ వైపే

టైమ్స్ నౌ - వీఎంఆర్, దిగ్విజయ టీవీ, ఏబీపీ, న్యూస్ఎక్స్-సీఎన్ఎక్స్, రిపబ్లిక్-జన్ కీ బాద్, యాక్సిస్ మై ఇండియా, సీ ఓటరు, న్యూస్ నేషన్ తదితర అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేల్లోను బీజేపీ లేదా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తుంది కానీ మెజార్టీకి కావాల్సిన సీట్లు సాధించదని వెల్లడైంది. అయితే ఎక్కువ సర్వేల్లో బీజేపీ ముందంజలో ఉంది.

బీజేపీ గెలుస్తుందని ఒకటి, కాంగ్రెస్ వైపు మరొకటి

బీజేపీ గెలుస్తుందని ఒకటి, కాంగ్రెస్ వైపు మరొకటి

ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చింది కేవలం రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. బీజేపీకి 120 సీట్ల వరకు వస్తాయని టుడేస్ చాణక్య - టైమ్స్ నౌ సర్వే వెల్లడించగా, కాంగ్రెస్ పార్టీకి 106-118 సీట్లు రావొచ్చని ఇండియా టుడే - యాక్సిస్ సర్వే వెల్లడించింది.

టుడేస్ చాణక్య -2014 లోకసభ ఎన్నికలు

టుడేస్ చాణక్య -2014 లోకసభ ఎన్నికలు

ఇక్కడే ఆసక్తికర అంశం ఉంది. కర్నాటకలో బీజేపీ 120 సీట్లతో స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని చెప్పిన టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ సర్వే 2014 లోకసభ ఎన్నికల్లోను దాదాపు నిజమైంది. దీనిని పరిగణలోకి తీసుకుంటే బీజేపీ స్పష్టమైన అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జేడీఎస్ హంగ్ కలేనా!

జేడీఎస్ హంగ్ కలేనా!

హంగ్ వస్తే తాము చక్రం తిప్పుతామని, కింగ్ మేకర్ అవుతామని జేడీఎస్ మొదటి నుంచి భావిస్తోంది. కానీ ఎగ్జిట్ పోల్ సరళిని బట్టి చూస్తే కింగ్ మేకర్ జేడీఎస్‌తో పాటు స్వతంత్రులు కూడా అయ్యేందుకు అవకాశముంది. ఎందుకంటే ఎక్కువ సర్వేలు ఏ పార్టీ అయినా మేజిక్ ఫిగర్‌కు సమీపంలో సీట్లు గెలుస్తాయని వెల్లడించాయి. దీంతో జేడీఎస్ మాత్రమే కాకుండా స్వతంత్రులు కూడా కీలకంగా మారే అవకాశముంది. నాలుగైదు సీట్లు అవసరమయ్యే పరిస్థితి వస్తే జేడీఎస్‌ను కాదని స్వతంత్రులను బీజేపీ లేదా కాంగ్రెస్ దరి చేర్చుకోవచ్చు. ఏ పార్టీకి 105కు పైగా సీట్లు వచ్చినా జేడీఎస్ హంగ్ కల కలగానే మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

టుడేస్ చాణక్య ఇలా

టుడేస్ చాణక్య ఇలా

2014లో టుడేస్ చాణక్య చెప్పిన ఎగ్జిట్ ఫలితాలు సరిగా పోలినవి. దానికి తోడు కర్నాటకలో తొలుత వెనుకబడిన బీజేపీ మోడీ ప్రచారం తర్వాత బాగా పుంజుకుందని అన్ని సర్వేలు వెల్లడించాయి. దీంతో టుడేస్ చాణక్య సర్వే అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్ సర్వే 2013లో, ఇప్పుడు (2018)లో చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి...

పార్టీ 2013 2018
బీజేపీ 40 120±11 (ప్లస్ లేదా మైనస్)
కాంగ్రెస్ 122 73±11 (ప్లస్ లేదా మైనస్)
జేడీఎస్+ 40 26±7 (ప్లస్ లేదా మైనస్)
ఇతరులు 22 3±3 (ప్లస్ లేదా మైనస్)

అయితే, ఇదే టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాలు గుజరాత్‌లో ఫెయిలయ్యాయి. యూపీలో బంపర్ మెజార్టీతో గెలుస్తుందని వెల్లడించగా అది నిజమైంది.

ఐదు బీజేపీ, రెండు కాంగ్రెస్

ఐదు బీజేపీ, రెండు కాంగ్రెస్

మొత్తంగా ఎగ్జిట్ పోల్ సర్వేలను పరిశీలిస్తే 5 సర్వేలు బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పగా, 2 సర్వేలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని చెప్పాయి. మరో రెండు ఛానల్స్‌లలో ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని తెలిపింది.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

Times Now-VMR: Seat Swings: BJP: 48, Congress: -24, JD(S)+: -5, Others: -19

C-Voter exit poll - BJP will win 103 seats, Congress 93 seats, JD(S) 25 seats, and Others 1.

Local Kannada channel, Suvarna's exit poll: Cong: 106 to 118; BJP: 79-92; JDS: 22-30; Others: 1-4

Digvijay News Exit Polls: BJP: 103-107 |CONGRESS: 76-80 |JDS: 31-35 | OTHERS: 04-08

Zee News Exit Poll: Congress: 90-103, BJP: 80-93, JDS: 31-39 and Others: 2-4

News Nation exit polls: BJP: 105-109 |Cong: 71-75 | JDS: 36-40 |Others: 3-5

India Today Exit Polls: Congress to get 106-118 seats, BJP- 79-92, JDS-22-30 seats and Others- 1-4

CNN-IBN exit poll predictions - Cong - 90-103; BJP - 80-93; JDS+ 31-39; Others 2-4

'Jan Ki Baat' exit poll predicts Congress-73-82 seats, BJP- 95-114, JDS- 32-43 and Others 2-3

Times Now-VMR Exit poll predictions are out: BJP 80 -93 | Congress 90 - 103 | JD(S) - 31-39 | Others 2-4 - Margin of ±3 percent | 6,872 respondents / all region

English summary
The voter has spoken. Polling came to a close and the next date to be watched would be May 15 when the counting of votes would take place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X