వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ వాకౌట్, ఫ్లోర్ టెస్ట్‌లో నెగ్గిన కుమారస్వామి: ఏం చేయలేనని సీఎం, దులిపేసిన యెడ్డీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి నెగ్గారు. శుక్రవారం ఉదయం సభ సమావేశం అనంతరం బీజేపీ స్పీకర్ బరి నుంచి తప్పుకుంది. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కుమారస్వామి విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశ పెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో విశ్వాస పరీక్షలో కుమారస్వామి గెలుపు లాంఛనం అయింది. గెలుపు అనంతరం కాంగ్రెస్ -జేడీఎస్ సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.

Karnataka floor test LIVE: Congress-JD(S) issue whips to MLAs

Newest First Oldest First
3:50 PM, 25 May

విశ్వాస పరీక్షలో కుమారస్వామి నెగ్గారు. జేడీఎస్- కాంగ్రెస్ పార్టీలకు 117 సభ్యుల బలం ఉంది.
3:34 PM, 25 May

బీజేపీ వాకౌట్ అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. బీజేపీ నాటకాలు ఆడుతోందన్నారు. నాటకాలకు ఇక్కడ రిహార్సల్స్ చేసినట్లుగా ఉందన్నారు. జాతీయ గీతాన్ని అవమానించే వారు నాకు చెబుతారా అన్నారు.
3:34 PM, 25 May

బీజేపీ వాకౌట్ చేసిన నేపథ్యంలో కుమారస్వామి ఎన్నిక లాంఛనమే. ఏకగ్రీవం అవుతుంది. మరోవైపు, బీజేపీ సోమవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చింది.
3:24 PM, 25 May

అవిశ్వాస పరీక్షకు ముందు బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. బీజేపీ వాకౌట్ చేస్తుండగా కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు షేమ్ షేమ్ అని నినాదాలు చేశారు.
3:21 PM, 25 May

తనతో గతంలో ఎప్పుడు కూడా నీ తండ్రికి ఇబ్బంది లేదని, కానీ ఈ ఇరవై నెలల్లో వచ్చిందా అని యడ్యూరప్ప కుమారస్వామిని ప్రశ్నించారు. నేను రైతులకు ఏదో చేయాలని రుణమాఫీ అంటే దేవేగౌడకు రుచించలేదన్నారు. గతంలో కుమారస్వామితో కలిసినందుకు పశ్చాత్తాపపడుతున్నానని చెప్పారు.
3:18 PM, 25 May

నేను సిద్ధరామయ్యను, శివకుమార్‌ను ఓ ప్రశ్న అడుగుతున్నానని, అసలు మిమ్మల్ని కాదని కుమారస్వామిని మీ హైకమాండ్ పిలిచిందని, మీరు ఎలా ఫీలవుతున్నారని యెడ్డీ ప్రశ్నించారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో సిద్ధరామయ్య పక్కకు ఉన్నారని, అలా ఎందుకు జరిగిందన్నారు.
3:16 PM, 25 May

జేడీఎస్ సిద్ధరామయ్యను అవమానించిందని యడ్యూరప్ప చెప్పారు. జేడీఎస్ కేవలం 37 స్థానాల్లోనే గెలిచిందన్నారు. కుమారస్వామి అవకాశవాది అన్నారు.
3:13 PM, 25 May

బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాను కుమారస్వామి విషయంలో ఒక్కసారి జోక్యం చేసుకోలేదని యడ్యూరప్ప చెప్పారు. ఆ రోజు మేం మీతో చేతులు కలపకుంటే మీరు ఎక్కడ ఉండేవారో గుర్తుకు తెచ్చుకోండి అన్నారు.
3:12 PM, 25 May

నా పోరాటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన కాదని, అవినీతిపరులైన దేవేగౌడ, కుమారస్వామిల పైన అని యడ్యూరప్ప చెప్పారు. కుమారస్వామిని సీఎంగా చేసినందుకు శివకుమార్ ముందు ముందు చింతిస్తారని జోస్యం చెప్పారు.
2:44 PM, 25 May

కర్ణాటక ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదని కుమారస్వామి అన్నారు. హంగ్ ప్రభుత్వాన్ని మేమే కొనసాగిస్తామని, సంకీర్ణ ప్రభుత్వం మన రాష్ట్రానికి కొత్తేం కాదన్నారు. బీజేపీ కర్ణాటకలో ఆపరేషన్ లోటస్‌కు ప్రయత్నించి విఫలమైందని కుమారస్వామి చెప్పారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం ప్రజాస్వామ్యాన్ని గెలిపించిందన్నారు. యెడ్డీకి బలనిరూపణకు సుప్రీం ఒకటే రోజు ఇచ్చిందని గుర్తుచేస్తూ, అత్యున్నత న్యాయస్థానానికి థ్యాంక్స్ చెప్పారు.
2:40 PM, 25 May

తమది కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలతో కూడిన అలయెన్స్ ప్రభుత్వమని, రైతు రుణాలు సహా దేని పైనా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోజాలనని, నేను ఇప్పటికీ చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్‍‌ను అని (బలనిరూపణ పూర్తికానందుకు) రైతు రుణ మాఫీపై తాను అందరి సలహాలు తీసుకోవాల్సి ఉందన్నారు. తద్వారా ఈ ప్రభుత్వంలో తాను ఒంటరిగా నిర్ణయాలు తీసుకోలేనని చెబుతూ, రైతు రుణాలపై మెలిక పెట్టారు.
2:38 PM, 25 May

రైతు రుణాలు మాఫీ చేసేందుకు తాను సిద్ధమని, కానీ సభలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే సంపూర్ణ బలం లేదని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. నేను రైతుల జీవితాలతో ఆడుకోనని చెప్పారు.
2:24 PM, 25 May

రైతు రుణమాపీపై నేను యడ్యూరప్ప నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని కుమారస్వామి చెప్పారు.నేను గతంలో బీజేపీతో అలయెన్స్ ఏర్పాటు చేసి, తన తండ్రికి మచ్చ తెచ్చానని, ఇప్పుడు దానిని తొలగించానని అభిప్రాయపడ్డారు.
2:21 PM, 25 May

కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా యడ్యూరప్ప కొనసాగనున్నారు. స్పీకర్ కెఆర్ రమేష్ కుమార్ దీనిపై సభలో ప్రకటన చేయనున్నారు.
2:15 PM, 25 May

కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గేలకు కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాల్సిందిగా మొదట ప్రతిపాదించింది వారేనని ఆయన చెప్పారు. బీజేపీతో గనుక చేతులు కలిపితే.. కుటుంబం మొత్తం నిన్ను వ్యతిరేకిస్తుందని తన తండ్రి దేవెగౌడ హెచ్చరించారని కుమారస్వామి గుర్తుచేసుకున్నారు.
2:05 PM, 25 May

కర్ణాటక ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు, సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. సీఎంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు: కుమారస్వామి
1:48 PM, 25 May

ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. స్పీకర్ దానిని ఆమోదించారు.
1:47 PM, 25 May

రమేష్ కుమార్ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు.
1:12 PM, 25 May

స్పీకర్ అయిదేళ్ల పాటు సభను విజయవంతంగా నడిపించాలని కోరుకుంటున్నానని సిద్ధరామయ్య అన్నారు. సిద్ధరామయ్య ఓ సమయంలో సభలో నవ్వులు పూయించారు. రమేష్ కుమార్ ఎంపికను స్వాగతిస్తూ.. అతనికి చట్టంపై ఎంతో అవగాహన ఉందని, అలాగే, క్రిమినల్ సైడ్ నుంచి లాయర్ అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో నవ్వులు వినిపించాయి.
1:11 PM, 25 May

స్పీకర్ ఎంపికకు సహకరించిన యడ్యూరప్పకు పరమేశ్వర కజత్ఞతలు తెలిపారు. రమేష్ కుమార్ ఎంపికకు సహకరించినందుకు డాక్టర్ శివకుమార్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
12:43 PM, 25 May

గతంలో స్పీకర్‌గా అనుభవం ఉన్న రమేష్ కుమార్ సభాపతి కావడం సంతోషకరమని యడ్యూరప్ప అన్నారు. స్పీకర్ పోస్టు గౌరవం కాపాడేందుకు తాము తమ అభ్యర్థి సభ్యత్వాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పారు. తమ్ముడు కుమారస్వామి తనను గౌరవిస్తూ మాట్లాడినందుకు కృతజ్ఞతలు అన్నారు. అంతకుముందు కుమారస్వామి మాట్లాడుతూ.. కర్ణాటకను కొత్తగా ముందుకు తీసుకు వెళ్తానని చెప్పారు.
12:35 PM, 25 May

స్పీకర్‌గా ఎన్నికైన రమేష్ కుమార్‌కు ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన ప్రతిపక్షాలకు కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు.
12:32 PM, 25 May

రమేష్ కుమార్ స్పీకర్‌గా పని చేయడం ఇది రెండోసారి. గతంలో ఎస్ఎం కృష్ణ ప్రభుత్వంలో తొలిసారి పని చేశారు. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత మళ్లీ స్పీకర్ అయ్యారు. ఇటీవలి వరకు సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీనివాసపురం నుంచి ఈయన ఆరుసార్లు గెలిచారు.
12:27 PM, 25 May

సురేష్ చివరి నిమిషంలో బరి నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ నేత రమేష్ ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
12:26 PM, 25 May

స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేసిన సురేష్ కుమార్ దానిని వెనక్కి తీసుకున్నారు.
12:22 PM, 25 May

కర్ణాటక అసెంబ్లీ జాతీయ గీతంతో ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధరామయ్య, బీజేపీ నేత యడ్యూరప్పలు తమ తమ స్థానాల్లో కూర్చున్న దృశ్యం.
12:21 PM, 25 May

కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ భేటీలో పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు శివకుమార్, ఆనంద్ సింగ్‌లు పాల్గొన్నారు.
12:20 PM, 25 May

అంతకుముందు, బీజేపీ శాసన సభ్యులు యడ్యూరప్ప నేతృత్వంలో షంగ్రిలా హోటల్లో భేటీ అయ్యారు. అనంతరం బస్సులో విధాన సౌధకు వచ్చారు.
11:55 AM, 25 May

కుమారస్వామి విశ్వాస పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులు బయటకు వస్తారని, అసెంబ్లీలోనే వారు తమ నిరసనను తెలుపుతారని, కుమారస్వామి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుందని బీజేపీ భావిస్తోంది. లింగాయత్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేదంటే తాము రాజీనామా చేస్తామని ఆ సామాజికవర్గం ఎమ్మెల్యేలు హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే బలపరీక్ష సాఫీగా సాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధిష్టానం వారిని బుజ్జగించవచ్చు.
11:51 AM, 25 May

కర్ణాటక విధాన సౌధలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైన దృశ్యం. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు వారి వారి ఎల్పీలలో సమావేశమయ్యారు.
READ MORE

English summary
H D Kumaraswamy whose Janata Dal (S) is in an alliance with the Congress will take the floor test at the Karnataka Legislative Assembly today. The new found alliance is confident of sailing through the trust vote as it enjoys the numbers in the 222 member House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X