బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ దెబ్బ: బళ్లారి గాలి సోమశేఖర్ రెడ్డి అరెస్టు, బీజేపీ ఆందోళనతో రగులుతున్న కర్ణాటక!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో మంగళూరు బైక్ ర్యాలీని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడంతో బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. బెంగళూరు, మంగళూరు, మైసూరు, బళ్లారి, కోలారు, చిక్కబళ్లాపురం, చామరాజనగర్, హుబ్బళి, ఉత్తర కన్నడ తదితర జిల్లాల్లో వేలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

సుప్రీం కోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి చుక్కెదురు, బళ్లారి, కడపకు నో, బెంగళూరులో!సుప్రీం కోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి చుక్కెదురు, బళ్లారి, కడపకు నో, బెంగళూరులో!

బళ్లారి నుంచి చలో మంగళూరు బైక్ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గాలి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. బైక్ ర్యాలీ ముందుకు సాగిన రెండు నిమిషాలకే పోలీసులు అడ్డుకున్నారు. చలో మంగళూరు బైక్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పారు.

Karnataka former BJP MLA Gali Somashekar Reddy arrested

ఆ సందర్బంలో గాలి సోమశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్విదానికి దిగారు. గాలి సోమశేఖర్ రెడ్డితో పాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బెంగళూరులో మాజీ మేయర్ కట్టే సత్యనారాయణ, బీజేపీ కార్పొరేటర్ గౌతమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరులో భారీ వర్షాలు, రోడ్లు జలమయం, నాలుగు అడుగుల ఎత్తులో నీరు!బెంగళూరులో భారీ వర్షాలు, రోడ్లు జలమయం, నాలుగు అడుగుల ఎత్తులో నీరు!

Karnataka former BJP MLA Gali Somashekar Reddy arrested

సీఎం సిద్దరామయ్య చలో మంగళూరు బైక్ ర్యాలీని అడ్డుకోవచ్చు కాని ప్రజల మనోభావాలని అడ్డుకోవడానికి సాధ్యం కాదని కేంద్ర మంత్రి సదానందగౌడ సోషల్ మీడియాలో మండిపడ్డారు. హిందూ సంఘ, సంస్థల నాయకులు, కార్యకర్తల హత్యలను ఖండిస్తూ కర్ణాటకలోని అన్ని జిల్లాల నుంచి చలో మంగళూరు బైక్ ర్యాలీని బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటోంది.

English summary
Karnataka former BJP MLA Gali Somashekar Reddy arrested today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X