బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రివర్స్ గేర్: నాడు ముఖ్యమంత్రి, నేడు మంత్రి, వినడానికే విడ్డూరంగా ఉంది, అక్కడే సాధ్యం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్ణాటకలో విచిత్రమైన సంఘటన ఎదురైయ్యింది. మంత్రులుగా పని చేసిన తరువాత ముఖ్యమంత్రులు అయిన సంఘటనలు మనం చాల చూశాం. అయితే ముఖ్యమంత్రిగా పని చేసి తరువాత మంత్రిగా పని చెయ్యడానికి బీజేపీ నాయకుడు సిద్దం అయ్యారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రి అయ్యి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు.

జగదీష్ శెట్టర్ అంటే !

జగదీష్ శెట్టర్ అంటే !

కర్ణాటకలోని హుబ్బళి = ధారవాడ సెంట్రల్ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే జగదీష్ శెట్టర్. జగదీష్ శెట్టర్ ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. జగదీష్ శెట్టర్ 1994లో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా జగదీష్ శెట్టర్ పని చేశారు. 2005లో బీజేపీ హైకమాండ్ కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడి భాద్యతలు జగదీష్ శెట్టర్ కు అప్పగించింది.

మంత్రి పదవి ఇవ్వకుంటే సీఎం అయ్యారు

మంత్రి పదవి ఇవ్వకుంటే సీఎం అయ్యారు

2008లో యడియూరప్ప ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన సమయంలో జగదీష్ శెట్టర్ కు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ సమయంలో జగదీష్ శెట్టర్ కు స్పీకర్ పదవి ఇచ్చారు. బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో యడియూరప్ప రాజీనామా చేసిన తరువాత డివి. సదానందగౌడ సీఎం అయ్యారు. తరువాత సదానందగౌడ ప్రభుత్వంలో జగదీష్ శెట్టర్ మంత్రిగా పని చేశారు. యడియూరప్ప పట్టుబట్టి సదానందగౌడతో సీఎం పదవికి రాజీనామా చేయించిన తరువాత జగదీష్ శెట్టర్ కర్ణాటక ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించారు.

శెట్టర్ రివర్స్ గేర్

శెట్టర్ రివర్స్ గేర్

కర్ణాటక ముఖ్యమంత్రిగా సుమారు 10 నెలలకు పైగా జగదీష్ శెట్టర్ పని చేశారు. హైకమాండ్ ఆదేశిస్తే తాను యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పని చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని ఇటీవల జగదీష్ శెట్టర్ అన్నారు. అధికారం కోసం జగదీష్ శెట్టర్ మంత్రి పదవి అడుగుతున్నారని కొందరు బీజేపీ నేతలు అన్నారు. సీఎంగా పని చేసిన జగదీష్ శెట్టర్ మళ్లీ వెనకడుగు వేసి మంత్రిగా పని చెయ్యడం ఏమిటని చాల మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక రాజకీయాలకే సాధ్యం

కర్ణాటక రాజకీయాలకే సాధ్యం

కర్ణాటక రాజకీయాల్లో జరిగిన రెండు సంఘటనలు దేశంలో ఎక్కడా జరగలేదు. 1958లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.డి. జత్తి పని చేశారు. 1965లొ అదే బి.డి. జత్తి కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. బి.డి. జత్తిని మినహాయిస్తే కర్ణాటక చరిత్రలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మళ్లీ అదే రాష్ట్రంలో మంత్రిగా పని చెయ్యలేదు. ఇప్పుడు బి.డి. జత్తి రికార్డును మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ బ్రేక్ చేస్తున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ రెండు సంఘటనలు దేశంలో ఎక్కడా జరగలేదు.

అందరివాడు

అందరివాడు

జగదీష్ శెట్టర్ కు ప్రజలతో పాటు బీజేపీ నాయకులు మెచ్చిన నాయకుడు అనే పేరు ఉంది. బీజేపీలో జగదీష్ శెట్టర్ ను వ్యతిరేకించే నాయకులు చాల తక్కువ మంది ఉన్నారు. మంత్రిగా, స్పీకర్ గా, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా జగదీష్ శెట్టర్ పని చేశారు. అయితే విచిత్రంగా జగదీష్ శెట్టర్ మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. యువకులకు అవకాశం ఇవ్వడానికి జగదీష్ శెట్టర్ మంత్రి పదవి త్యాగం చేసి ఉండాలని, అలా కాదని ఆయన అధికారం కోసం మళ్లీ మంత్రి అయ్యారని కొందరు బీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు.

English summary
Hubli-Dharwad Central assembly constituency MLA Jagadish Shettar joined B.S.Yediyurappa cabinet.Former Chief Minister of Karnataka new minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X