వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా సీఎం జగన్ కు జై, చూసి నేర్చుకోండి,నిన్న పవర్ స్టార్,సోనియా కే షాక్, కరోనా టైంలో,సిద్దూ ఝలక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ అమరావతి: కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్. జగన్ కు ఎవ్వరూ ఊహించని మద్దతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన వైస్. జగన్ కు అదే కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం తెగపొగిడేసి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి షాక్ ఇచ్చారు. కరోనా వైరస్ ను అరికట్టడంలో, పేదలను ఆదుకోవడంలో జగన్ సూపర్ గా పని చేస్తున్నారని సిద్దూ అన్నారు. అలాగే అధికారంలో ఉన్న బీజేపీ వలన పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదంటూ బీజేపీ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు. నిన్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం సీఎం జగన్ ను మెచ్చుకున్నారు. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీరుతో ఆయన వర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు అయోమయానికి గురైనారు.

Surprise: నక్కతోక తొక్కిన నటి నమిత, బుట్టబొమ్మకు ఊహించని చాన్స్, గౌతమి, గాయిత్రికి చాన్స్!Surprise: నక్కతోక తొక్కిన నటి నమిత, బుట్టబొమ్మకు ఊహించని చాన్స్, గౌతమి, గాయిత్రికి చాన్స్!

 సత్తా చాటిన సీఎం జగన్

సత్తా చాటిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో ఒకేసారి 1, 088 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించారు. 108, 104 అంబులెన్స్ లు మొత్తం 1, 088 వాహనాలు ఒకేసారి ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు పంపించడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్. జగన్ ఒక్కసారిగా మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు కేంద్ర బింధువు అయ్యారు.

 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హ్యాపీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హ్యాపీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పొగడ్తలతో ముంచేశారు. పేదప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1, 088 అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని, పేదలకు ఎవరైనా మంచి పని చేస్తే వారిని జనసేన పార్టీ స్వాగతిస్తుందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు.

 కాంగ్రెస్ టాప్ లీడర్, మాజీ సీఎం

కాంగ్రెస్ టాప్ లీడర్, మాజీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని తాజాగా కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్ సిద్దరామయ్య పొగడ్తలతో ముంచేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్న సమయంలో ఆ వ్యాధి బారిన పడుతున్న రోగులను ఆదువకోవడానికి, పేద ప్రజలకు నిత్యం 108, 104 వాహనాలు అందుబాటులోకి తీసుకురావడానికి ఆంధ్రా సీఎం వైఎస్, జగన్ ఒకేసారి 1, 088 వాహనాలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ట్వీట్ చేశారు.

 బీజేపీ ప్రభుత్వానికి ఝలక్

బీజేపీ ప్రభుత్వానికి ఝలక్

ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం (సీఎం బీఎస్. యడియూరప్ప) పేద ప్రజల గురించి కనీసం పట్టించుకోవడం లేదని, ఆంధ్రా సీఎం వైఎస్. జగన్ ను చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్, యడియూరప్ప నేర్చుకోవాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీ నాయకులకు ఝలక్ ఇచ్చారు.

 మీకు స్కామ్ లు ముఖ్యం, పేదలు కాదు !

మీకు స్కామ్ లు ముఖ్యం, పేదలు కాదు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రూ. 203 కోట్ల వ్యయంతో 1, 088 అత్యాధునిక అంబులెన్స్ లను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చారని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో రోడ్ల మీద పాడుపడిన అంబులెన్స్ లు సంచరిస్తున్నాయని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వానికి స్కామ్ లు చెయ్యడానికే సమయం సరిపోవడం లేదని, ఇక పేద ప్రజలను పట్టించుకోవడానికి టైం ఎక్కడ ఉంటుందని మాజీ సీఎం సిద్దరామయ్య వ్యంగంగా బీజేపీ నాయకులను విమర్శిస్తున్నారు.

 సోనియా గాంధీకి షాక్

సోనియా గాంధీకి షాక్

యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన వైఎస్. జగన్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యింది. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులనే ఎదిరించి సొంత పార్టీని స్థాపించి ఏకంగా సీఎం అయిన వైఎస్. జగన్ ను కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం సిద్దరామయ్య పొగడ్తలతో ముంచెయ్యడంతో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ కు గురైనారని తెలిసింది.

 దిక్కూదిమానం లేదు

దిక్కూదిమానం లేదు

కర్ణాటకలో సరైన ప్రభుత్వ 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో లేవని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా దేశ ఐటీ, బీటీ సంస్థల రాజధాని బెంగళూరులో ప్రభుత్వానికి చెందిన అంబులెన్స్ సేవలు సక్రమంగా అందుబాటులో లేవని, పేద ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. మొత్తం మీద కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్. జగన్ ను ఆకాశానికి ఎత్తేసి ఇటు సోనియా గాంధీతో పాటు బీజేపీ నాయకులకు షాక్ మీద షాక్ ఇచ్చేశారని ఆయన వర్గీయులు అంటున్నారు.

English summary
Coronavirus: Karnataka former CM and Congress leader Siddaramaiah Praises Andhra Pradesh CM YS Jagan Mohan Reddy govt For COVID- 19 management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X