బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు: యడ్యూరప్ప ఆరోపణ, షెడ్ లో వీవీ ప్యాట్ బ్యాక్స్ లు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో (2018) అక్రమాలు జరిగాయని, విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఎన్నికల కమిషన్ అధికారులకు లేఖ రాశారు. కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఓ షెడ్ లో 8 వీవీ ప్యాట్ మిషన్ బాక్స్ లు బయటపడిన నేపథ్యంలో బీఎస్. యడ్యూరప్ప భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

Recommended Video

యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ఓ ఆసక్తికర కథనం తెర పైకి
ఎన్నికల చీఫ్

ఎన్నికల చీఫ్

కర్ణాటకలో చట్టబద్దంగా ఎన్నికలు జరిగాయని ఎన్నికల సంఘం చెప్పడం పచ్చి అపద్దం అని భారత ఎన్నికల కమిషన్ చీఫ్ ఓపి. రావత్ కు రాసిన లేఖలో బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు చట్టబద్దంగా జరగలేదని బీఎస్. యడ్యూరప్ప ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

వీవీ ప్యాట్ బాక్స్ లు

వీవీ ప్యాట్ బాక్స్ లు

కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని షెడ్ లో చిక్కిన 8 వీవీ ప్యాట్ లు తరలించే బాక్సులు మాత్రమే అని, అవి యంత్రాలు కాదని కర్ణాటక ఎన్నికల చీఫ్ సంజీవ్ కుమార్ మీడియాకు చెప్పారు. వీవీ ప్యాట్ యంత్రాలు కౌంటింగ్ కేంద్రాలకు భద్రంగా చేరాయని కర్ణాటక ఎన్నికల చీఫ్ సంజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు.

గుజరాత్ కంపెనీ

గుజరాత్ కంపెనీ

గుజరాత్ కు చెందిన జ్యోతీ ప్లాస్టిక్ అనే కంపెనీ వీవీ ప్యాట్ లు తరలించే బాక్స్ లు తయారు చేసిందని కర్ణాటక ఎన్నికల చీఫ్ సంజీవ్ కుమార్ చెప్పారు. విజయపుర జిల్లా షెడ్ లో చిక్కిన వీవీ ప్యాట్ బ్యాక్స్ ల కంటే నాసిరకంగా ఉన్నాయని, అవి చూడటానికి అసలైనవిగా ఉన్నాయని, ఎన్నికల కోసం ఇలాంటి నాసిరకం బాక్స్ లు ఉపయోగించడం సాధ్యంకాదని కర్ణాటక ఎన్నికల చీఫ్ సంజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు.

ఆరు అంకెల బార్ కోడ్

ఆరు అంకెల బార్ కోడ్

వీవీ ప్యాట్ లు ఉపయోగించడంలో చాల జాగ్రత్తలు తీసుకుంటామని, అందులో ఆరు అంకెల బార్ కోడ్ ఉంటుందని, విజయపుర జిల్లాలోని షెడ్ లో చిక్కిన 8 వీవీ ప్యాట్ బాక్స్ లకు ఆరు అంకెల బార్ కోడ్ లేదని కర్ణాటక ఎన్నికల సంఘం చీఫ్ సంజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు.

కఠిన చర్యలు

కఠిన చర్యలు

విజయపుర జిల్లాలోని షెడ్ లో వీవీ ప్యాట్ నకిలీ బాక్స్ లు పెట్టిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల చీఫ్ సంజీవ్ కుమార్ హెచ్చరించారు. నకిలీ వీవీ ప్యాట్ బాక్స్ లు పెట్టి రాజకీయ పార్టీలల్లో, ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ఇలా చేశారని సంజీవ్ కుమార్ ఆరోపించారు.

English summary
BJP chief in Karnataka B S Yeddyurappa has written to the Election Commission alleging foul play in the recently concluded Karnataka assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X