ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే, హైకమాండ్ తో అప్ప ఢీ, బీఎల్ఎస్ కు షాక్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసిన తీరు పరిశీలిస్తే కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మార్క్ కచ్చితంగా కనపడుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో యడియూరప్ప మీద యుద్దం చేసిన బీఎల్, సంతోష్ కు ఎదురుదెబ్బ తగిలిందని ఈ లిస్ట్ చూస్తే స్పష్టం అవుతోందని బీజేపీ నాయకులు కొందరు అంటున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలో 189 మంది, రెండో జాబితాలో 23 మంది పేర్లను బీజేపీ హైకమాండ్ విడుదల చేసింది. ఇక కేవలం12 నియోజక వర్గాల అభ్యర్థుల పేర్లను బీజేపీ హైకమాండ్ ప్రకటించవలసి ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప, బీజేపీ నేత బీఎల్, సంతోష్ ల మధ్య గట్టిపోటీ ఉందని ఇంతకాలం మీడియా ప్రచారం చేసింది.

బీఎస్. యడియూరప్ప, బీఎల్. సంతోషల్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అవుతోందని ఇంతకాలం ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో యడియూరప్ప మార్క్ స్పష్టం కనపడుతోందని, బీఎల్, సంతోష్ మీద యడియూరప్ప పట్టుసాధించారని బీజేపీ నాయకులు అంటున్నారు.

తుమూకురులో సోగూడు శివన్నకు సీటు ఇప్పించాలని బీఎల్ సంతోష్ ప్రయత్నిస్తే తన మద్దతు దారుడు బి. సురేష్ కు యడియూరప్ప టిక్కెట్ ఇప్పించారు. బెంగళూరులోని బ్యాటరాయణపురలో యడియూరప్ప కుమారుడు విజయేంద్రకు చాలా సన్నిహితుడైన తమ్మేష్ గౌడకు టిక్కెట్ వచ్చింది. బీఎల్ సంతోష్ వర్గంలోని ఏ. రవికి బీజేపీ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది.
చిత్రదుర్గాలో యడియూరప్ప అనుచరుడు తిప్పారెడ్డికి సీటు రావడంతో బీఎల్ సంతోష్ వర్గంలోని నాయకుడు షాక్ అయ్యారు. 2019లో కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి యడియూరప్పకు సహకరించిన 17 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికి టిక్కెట్లు వచ్చేలా యడియూరప్ప చక్రం తప్పి కేంద్రంలో ఆయన పట్టు జారిపోకుండా చూసుకున్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదికి టిక్కెట్ ఇప్పించాలని బీఎల్ సంతోష్ ప్రయత్నిస్తే యడియూరప్ప ఆయన అనుచరుడు మహేష్ కుమటహళ్లికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. కొడుకు విజయేంద్రకు శికారిపురలో టిక్కెట్ ఇప్పించుకున్న యడియూరప్ప ఢిల్లీలో ఆయన పట్టు జారిపోకుండా చూసుకున్నారు.
అయితే మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విషయంలోనే బీఎస్, యడియూరప్ప ఒక్క అడుగు వెనక్కి వెయ్యాల్సి వచ్చిందని తెలిసింది. ఎలా లెక్కలు వేసుకున్న యడియూరప్ప మీద బీఎల్. సంతోష్ పై చెయ్యి సాధించలేకపోయారని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాల దగ్గర యడియూరప్ప పేరు అలాగే ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద కర్ణాటకలో మరోసారి బీజేపీలో లోలోపల కుమ్ముట బయటపడిందని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications