వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాన్ని అమ్మేస్తారా సీఎం గారు, మాజీ సీఎం అభ్యంతరం, తుగ్లక్ పాలన, కంపెనీ పేర్లు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కర్ణాటక రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారా ? అంటూ జేడీఎస్ పార్టీ ప్రశ్నించింది. ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తీరు చూస్తుంటే తనకు తుగ్లక్ పాలన గుర్తుకు వస్తోందని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మండిపడుతున్నారు.

వరద భాదితులను ఆదుకోవడానికి రూ. 10 కోట్లు, అంత కంటే ఎక్కువ విరాలు ఇచ్చే వ్యక్తుల పేర్లు లేదా కంపెనీల పేర్లు అభివృద్ది చేస్తున్న గ్రామాలకు పెడుతామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చెప్పారు. ఈ విషయంపై జేడీఎస్ పార్టీ సోషల్ మీడియాలో సీఎం యడియూరప్ప తీరును తప్పుపడుతూ ట్వీట్ చేసింది.

Karnataka former CM HD Kumaraswamy Objection On CM BS Yeddyurappa Decision To Rename The Village in Donors Name

జేడీఎస్ పార్టీ ట్వీట్ కు మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తనదైన శైలిలో స్పందించారు. కర్ణాటకలోని ప్రతి గ్రామం పేరుకు, అక్కడి ప్రజలకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి గుర్తు చేశారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలు సీఎం యడియూరప్ప తీసుకున్న నిర్ణయాలతో వారి గ్రామాల పేర్లను పోగొట్టుకునే అవకాశం ఉందని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. కర్ణాటకను విక్రయానికి పెట్టి ప్రజల మనోభావాలతో ఆడుకోరాదని జేడీఎస్ పార్టీ సూచించింది.

వరద భాదితులను ఆదుకునే విషయంలో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ సమావేశంలో సుమారు 60 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వరద భాదితులను ఆదుకునే దాతలు లేదా వారి కంపెనీల పేరల్లను అభివృద్ది చేస్తున్న గ్రామాలకు పెడుతామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చెప్పారు. సమావేశంలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు వరద భాదితునుల ఆదుకోవడానికి సహాయం చేస్తామని సీఎం యడియూరప్పకు హామీ ఇచ్చారు.

English summary
Karnataka former CM HD Kumaraswamy Objection On CM BS Yeddyurappa Decision To Rename The Village in Donors Name who donate for rehabilitation work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X