బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను ఎవరికి ద్రోహం చేశాను ? ఏం తప్పు చేశాను ?: విలపించిన మాజీ సీఎం, రాహుల్ గాంధీ చేశారు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. హృదయ శాస్త్ర చికిత్స చేసుకున్న నాకు ఇలాంటి కుళ్లు రాజకీయాలు చెయ్యడం అవసరమా ? నన్ను మోసం చేసి వెళ్లి పోయిన వారి గురించి ఈ రోజు ఇక్కడ మాట్లాడాతానని అనుకోలేదని, తనను ఆకాశానికి ఎత్తిన వ్యక్తి ఈ రోజు నట్టేట ముంచి వెళ్లి పోయారని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి మండ్య జిల్లా ఉప ఎన్నికల ప్రచారం సమయంలో కన్నీరు పెట్టుకున్నారు. మండ్య జిల్లాలో తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని ఓడించి ఆ రోజు కన్నీరు పెట్టించారు, ఇప్పుడు మళ్లీ తనతో కన్నీరు పెట్టిస్తున్నారని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తనను సీఎం చేసి కాంగ్రెస్ నాయకుల చేతిలో ఇరికించారని కుమారస్వామి ఆరోపించారు.

ఏకాంతంలో ప్రేమికులు, అడ్డుపడిన మహిళ హత్య, నీ అక్రమ సంభందం మాకు తెలుసు, లేదంటే!ఏకాంతంలో ప్రేమికులు, అడ్డుపడిన మహిళ హత్య, నీ అక్రమ సంభందం మాకు తెలుసు, లేదంటే!

రాహుల్ గాంధీ చేసిన పని

రాహుల్ గాంధీ చేసిన పని

రెండు పూట్ల భోజనం చెయ్యడానికి ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమా అని మండ్య జిల్లా కిక్కేరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేడీఎస్ కార్యకర్తలను మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. రెండు పూట్ల భోజనం చెయ్యడానికి ఇలాంటి రాజకీయాలు చెయ్యాల్సిన అవసరం తనకు లేదని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి తనను సీఎం కావాలని మనవి చేశారని, రాహుల్ గాంధీ తనను ఈ కాంగ్రెస్ నాయకుల చేతిలో చిక్కుకునేలా చేశారని మాజీ సీఎం కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు.

నేను ఏం తప్పు, ఏం పాపం చేశాను ?

నేను ఏం తప్పు, ఏం పాపం చేశాను ?

మండ్య జిల్లా ప్రజలకు నేను ఏం ద్రోహం చేశాను ?, ఏం తప్పు చేశాను ? అంటూ మాజీ సీఎం కుమారస్వామి బోరున విలపించారు. మండ్య జిల్లా ప్రజలను తన సొంత బిడ్డలాగా చూసుకున్నానని, అయినా లోక్ సభ ఎన్నికల్లో నా కుమారుడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారని, ఇప్పుడు మళ్లీ ఓ శాసన సభ్యుడు ఉప ఎన్నికలు రావడానికి కారణం అయ్యారని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

బాంబే దొంగ అన్నారు

బాంబే దొంగ అన్నారు

అనర్హత ఎమ్మెల్యే తనను బాంబే దొంగ అంటున్నారు, మా తండ్రి, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ మీద చాలా సార్లు ఆరోపణలు చేశారు అయినా ఆయన ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నేను టిక్కెట్ ఇచ్చాను. ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చి గెలిపించిన నారాయణగౌడ ఈ రోజు మనల్ని మోసం చేశారని, అందులో తన తప్పు ఉందని, ఇప్పుడు ఉప ఎన్నికల్లో అతన్ని కచ్చితంగా ఓడించాలని స్థానిక ఓటర్లకు కుమారస్వామి మనవి చేశారు.

వెన్నుపోటు పొడిచాడు

వెన్నుపోటు పొడిచాడు

తనను దేవుడు అని బహిరంగంగా చెప్పిన నారాయణగౌడ జేడీఎస్ పార్టీకి, తనకు తీరని ద్రోహం చేశాడని, అందరికీ వెన్నుపోటు పొడిచాడని, ఈ ఉప ఎన్నికల్లో అతని సరైన బుధ్దిచెప్పాలని స్థానికులకు హెచ్.డీ. కుమారస్వామి మనవి చేశారు. అనారోగ్యంతో నారాయణగౌడ ఆసుపత్రిలో చేరలేదని, ఆపరేషన్ కమలలో భాగంగా బీజేపీ నాయకుల దగ్గర భారీ మొత్తంలో డబ్బులో తీసుకుని ఆసుపత్రిలో చేరి ఇంతకాలం నాటకాలు ఆడాడని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఇదే సమయంలో గతంలో అనర్హత ఎమ్మెల్యే తనను పొగుడుతూ రాసిన లేఖను మాజీ సీఎం కుమారస్వామి చదువుతూ కన్నీరు పెట్టుకోవడంతో స్థానికులు ఆయన్ను ఓదార్చారు.

English summary
Karnataka Former CM Kumaraswamy get emotional while talking in campaign rally in Mandya. He ask Mandya people that 'why they left my hand'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X