నేడే అవిశ్వాస తీర్మానం పెట్టండి, బీజేపీ డిమాండ్ ,సీఎం రాజీనామా చెయ్యాలి, స్పీకర్, రెబల్ !
బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం కథ క్లైమాక్స్ కు చేరుకుంది. సీఎం కుమారస్వామి సోమవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలని మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప స్పీకర్ రమేష్ కుమార్ కు మనవి చేశారు. సీఎం కుమారస్వామి సైతం స్పీకర్ రమేష్ కుమార్ ను కలవడంతో కథ రసవత్తరంగా మారింది.
ఇన్ని రోజులు రిసార్టు రాజకీయాలు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు సోమవారం మద్యాహ్నం విధాన సౌధ చేరుకున్నారు. శాసన సభ సమావేశంలో అవిశాస్వ తీర్మానం ప్రవేశ పెట్టడానికి తనకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే సీఎం కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ కు మనవి చేశారు.

సీఎం కుమారస్వామికి మెజారీ ఎమ్మెల్యేల మద్దతు లేదని, వెంటనే ఆయన రాజీనామా చెయ్యాలని మాజీ సీఎం యడ్యూరప్ప డిమాండ్ చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ రమేష్ కుమార్ కు మనవి చేశారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులను చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పీకర్ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.
రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల మీద మంగళవారం వరకు అనర్హత వేటు వెయ్యకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది, ఈ సమయంలో తాను ఏమీ చెయ్యలేనని స్పీకర్ రమేష్ కుమార్ కాంగ్రెస్ నాయకులకు చెప్పారని తెలిసింది.
స్పీకర్ ఇచ్చిన సమాధానంతో కాంగ్రెస్ నాయకులు ఢీలాపడిపోయారు.
సోమవారం కర్ణాటక శాసన సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసన సభ సమావేశం అయిన వెంటనే 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడంతో ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేదని, వెంటనే సీఎం కుమారస్వామి రాజీనామా చెయ్యాలని బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. తనకు మెజారీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం కుమారస్వామి ధీమాగా ఉన్నారు.