వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధాని ఆకాశం నుంచి దిగి వచ్చారా ?, కాంగ్రెస్ లీడర్ సూటి ప్రశ్న, అతి చేస్తున్నారు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలై రెండు వారాలు అయినా కర్ణాటకలోని తుమకూరు లోక్ సభ నియోజక వర్గంలో ఓటమిపాలైన మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ గురించి ఎందుకు అంత చర్చ జరుగుతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్. రాజన్న ప్రశ్నించారు.

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాజన్న మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఓటమి గురించి ఇంతగా చర్చించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఎంతో మంది ప్రములు ఓడిపోయారని, వారి గురించి ఎక్కడా ఇంత చర్చ జరగడం లేదని రాజన్న గుర్తు చేశారు.

కోలారులో కేహెచ్. మునియప్ప, కులబురిగిలో మల్లికార్జున్ ఖార్గే, చిక్కబళ్లాపురలో వీరప్పమొయిలీ లాంటి నాయకులు ఓటమిపాలైనారని, వారు జాతీయ స్థాయి నాయకులు కాదా ? వారి గురించి ఎందుకు ఇంత చర్చ జరగడం లేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజన్న ప్రశ్నించారు.

Karnataka former Congress MLA KH Rajanna asked why more debate on HD Deve Gowdas defeat only

మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఏమైనా ఆకాశం నుంచి దిగి వచ్చారా ఓడిపోకుండా ఉండటానికి అని రాజన్న ప్రశ్నించారు. గతంలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఓడిపోయారని, తరువాత వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారని. అందరిలాగా ఆయన నాయకుడే అని రాజన్న గుర్తు చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ గురించి జేడీఎస్ పార్టీతో పాటు నాయకులు తీవ్రస్థాయిలో చర్చించుకుని అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాజన్న ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తుమకూరులో ఓడిపోయిన మాజీ ప్రధాని దేవేగౌడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా ? అనే విషయంలో తాను క్లారిటీ ఇవ్వలేనని మాజీ ఎమ్మెల్యే రాజన్న అన్నారు.

English summary
Madhugiri former Congress MLA KN Rajanna is not happy with the debates going on HD Devegowda defeat in Tumakuru Lok Sabha elections. Many national leaders like Muniyappa, Kharge also lost in the elections, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X