వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనం కులం నాయకులు ఒక్కటి కావాలి, తీహార్ జైలుకు పంపిస్తే అంతా అయిపోలేదు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చట్టపరంగా న్యాయస్థానంలో పోరాటం చేసి డీకే. శివకుమార్ క్లీన్ చిట్ తో బయటకు వస్తారని, అందులో ఎలాంటి డౌట్ లేదని కర్ణాటక మాజీ మంత్రి చెలువరాయస్వామి అన్నారు. తీహార్ జైలుకు పంపించినంత మాత్రానా అంతా అయిపోలేదని, మనం కులం (ఒక్కలిగ) వారు అందరూ ఏకం అయ్యి డీకే. శివకుమార్ కు అండగా ఉండాలని చెలువరాయస్వామి ఒక్కలిగులకు పిలుపునిచ్చారు.

సోమవారం బెంగళూరులోని సదాశివనగర్ లోని డీకే. శివకుమార్ తో భేటీ అయిన చెలువరాయస్వామి కార్యకర్తలను ఉద్దేశించించి మాట్లాడారు. డీకే. శివకుమార్ అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారని, ఆయన ఒక్కడే ఎదగకుండా చాల మందికి సహాయం చేశారని చెలువరాయస్వామి అన్నారు.

మన కులంలో రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన డీకే. శివకుమార్ మీద కక్ష కట్టి అనవసరంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని చెలువరాయస్వామి బీజేపీ మీద ఆరోపించారు. ఇలాంటి సమయంలో డీకే. శివకుమార్ కు మనం అండగా ఉండాలని చెలువరాయస్వామి ఒక్కలిగులకు పిలుపునిచ్చారు.

Karnataka former Minister Cheluvarayaswamy met Karnataka former minister D.K.Shivakumar

సంకీర్ణ ప్రభుత్వంలో హెచ్.డీ. కుమారస్వామి, డీకే. శివకుమార్ కలిసి పని చేశారని, ఇప్పుడూ కలిసే ఉన్నారని, ఎప్పుడూ కలిసే ఉంటారని చెలువరాయస్వామి జోస్యం చెప్పారు. రాజకీయాలు వేరు, కులం విషయం వేరు, కుమారస్వామి, డీకే. శివకుమార్ ను ఎవ్వరూ వేరు చెయ్యలేరని చెలువరాయస్వామి అన్నారు.

కాంగ్రెస్ మళ్లి అధికారంలోకి రావడానికి సిద్దరామయ్య, డీకే. శివకుమార్, మల్లికార్జున్ ఖార్గే, పరమేశ్వర్ తదితరులు శక్తి వంచనలేకుండా పని చేస్తున్నారని చెలువరాయస్వామి అన్నారు. ఒక్కలిగులు ఒక్కటి అయ్యిన రోజు డీకే. శివకుమార్ కు చెడుచెయ్యాలని ఆలోచిస్తున్న వారికి దడ పుడుతుందని చెలువరాయస్వామి పరోక్షంగా బీజేపీ నాయకుల మీద మండిపడ్డారు.

English summary
Karnataka former Minister Cheluvarayaswamy met Karnataka former minister D.K.Shivakumar. He will win in legal battle said after meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X