వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమాస్తుల్లో డీకే ప్రపంచ రికార్డు, ట్రబుల్ షూటర్ త్రిబుల్ సెంచురి, ఈడీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ అక్రమాస్తులు సంపాదించడంలో ప్రపంచ రికార్డు సృష్టించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. డీకే. శివకుమార్ సుమారు రూ. 300 కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఈడీ తరపు న్యాయవాదులు అంటున్నారు. క్రికెట్ లో ఎలా త్రిబుల్ సెంచురి (300 రన్ లు) చేస్తారో అలా డీకే. శివకుమార్ అక్రమాస్తులు సంపాధించడంలో త్రిబుల్ సెంచురి చేశారని ఈడీ తరపు న్యాయవాది కేఎం. నటరాజ్ ఆరోపించారు.

రాసలీలల దెబ్బతో భర్తను రూ. 5 లక్షలకు అమ్మేసిన భార్య, కొనుక్కున్న ప్రియురాలు!రాసలీలల దెబ్బతో భర్తను రూ. 5 లక్షలకు అమ్మేసిన భార్య, కొనుక్కున్న ప్రియురాలు!

బెయిల్ ఎందుకు వద్దంటే!

బెయిల్ ఎందుకు వద్దంటే!

అక్రమాస్తులు సంపాదించారని, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు అరెస్టు చేసిన డీకే శివకుమార్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. డీకే శివకుమార్ కు బెయిల్ ఇచ్చే విషయంలో న్యాయమూర్తి సురేష్ కుమార్ కైట్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ముందు ఈడీ న్యాయవాది నటరాజ్ వాదనలు వినిపించారు. డీకే. శివకుమార్ కు బెయిల్ ఇస్తే ఆయన పలుకుబడి ఉపయోగించి సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి సురేష్ కుమార్ కైట్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ముందు ఈడీ న్యాయవాది నటరాజ్ వాదనలు వినిపించారు.

300 కంటే ఎక్కువ ఆస్తులు

300 కంటే ఎక్కువ ఆస్తులు

డీకే. శివకుమార్ కేసులో ఆయన కుటుంబ సభ్యులను ఈడీ అధికారులు విచారణ చేశారు. డీకే. శివకుమార్ సోదరుడు, బెంగళూరు గ్రామీణ జిల్లా ఎంపీ డీకే. సురేష్ కు 27 ఆస్తులు, వీరి తల్లి గౌరమ్మకు 38 ఆస్తులు, డీకే శివకుమార్ కు 24 ఆస్తులు ఉన్నాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులకు 300 కంటే ఎక్కువ వ్యవసాయేతర ఆస్తులు ఉన్నాయని, ఈ ఆస్తులను పూర్తిగా నగదు చెల్లించి వీరు కొనుగోలు చేశారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఆస్తుల కొనుగోలుకు డబ్బు ఎక్కడిది ?

ఆస్తుల కొనుగోలుకు డబ్బు ఎక్కడిది ?

300 కంటే ఎక్కువ ఆస్తులు కొనుగోలు చెయ్యడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం మాజీ మంత్రి డీకే. శివకుమార్ చెప్పడం లేదని ఈడీ అధికారులు అంటున్నారు. డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వరకు కేవలం 22 ఏళ్ల వయసు ఉందని, అయితే ఆమె ఆస్తులు రూ. 108 కోట్లకు పైగా ఉందని, ఇందులో రూ. 40 కోట్ల రుణం ఉందని, ఆ రుణం ఆమెకు ఎవరు ఇచ్చారు ? అని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డీకే. శివకుమార్ ది మనీ ల్యాండరింగ్ క్లాసిక్ కేసు అని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.

 డీకే సన్నిహితుల దెబ్బ

డీకే సన్నిహితుల దెబ్బ

డీకే. శివకుమార్ కు అత్యంత సన్నిహితులకు చెందిన ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు దాడులు చేసిన సమయంలో రూ. 8. 59 కోట్ల నగదు బయటపడింది. ఆ నగదుతో పాటు విలువైన డాక్యూమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు తనదే అని మాజీ మంత్రి డీకే. శివకుమార్ అంగీకరించారు. వ్యవసాయం చెయ్యడం వలనే తనకు ఇంత మొత్తంలో డబ్బు వచ్చిందని డీకే. శివకుమార్అటున్నారని ఈడీ అధికారులు తెలిపారు.

1989 నుంచి గోల్ మాల్

1989 నుంచి గోల్ మాల్

మాజీ మంత్రి డీకే. శివకుమార్ మీద ఈడీ అధికారులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. 1989 నుంచి డీకే. శివకుమార్ కు సాక్షాలు తారుమారు చేసే గోల్ మాల్ అలవాటు ఉందని ఈడీ తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న డీకే. శివకుమార్ కు బెయిల్ ఇస్తే ఇలాగే సాక్షాలు తారుమారు చేస్తారని ఈడీ ఆరోపిస్తోంది. మొత్తం మీద డీకే. శివకుమార్ కు బెయిల్ ఇవ్వరాదని ఈడీ అధికారులు కోర్టు ముందు బలంగా వాదనలు వినిపిస్తున్నారు.

English summary
New Delhi: Karnataka former Minister DK Shivakumar has set a world record in property gains, says the Directorate of Enforcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X