వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను రేప్ లు, హత్యలు చెయ్యలేదు, ట్రబుల్ షూటర్, ఢిల్లీ పెద్దల రాజకీయ కక్ష, ఈడీ ఎంట్రీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నేను రేప్ లు చెయ్యలేదు, హత్యలు చెయ్యలేదు, మోసం, దగ చెయ్యలేదు, ఎవరి డబ్బులు లూటీ చెయ్యలేదు, మా పార్టీకి చెందిన శాసన సభ్యులను కాపాడుకున్నందుకుకేంద్రంలోని పెద్దల ఆదేశాలతో ఈడీ అధికారులు సమన్లు ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ఆరోపించారు. విచారణకు హాజరు కావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు డీకే. శివకుమార్ కు సమన్లు జారీ చేశారు. ఈడీ సమన్లు ఇవ్వడంతో శుక్రవారం డీకే శివకుమార్ బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, ఈడీ అధికారుల తీరుపై డీకే. శివకుమార్ మండిపడ్డారు.

అక్రమ మైనింగ్ కేసు, మాజీ సీఎం సేఫ్, రిల్యాక్స్, రూ. 150 కోట్లు లంచం ? గాలి జనార్దన్ రెడ్డి !అక్రమ మైనింగ్ కేసు, మాజీ సీఎం సేఫ్, రిల్యాక్స్, రూ. 150 కోట్లు లంచం ? గాలి జనార్దన్ రెడ్డి !

ఢిల్లీ పెద్దల రాజకీయ కక్ష

ఢిల్లీ పెద్దల రాజకీయ కక్ష

మా పార్టీ ఎమ్మెల్యేలు (గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు)ను బెంగళూరు నగర శివార్లలోని బిడిది రిసార్టులో పెట్టి కాపాడుకున్నందుకు తన మీద ఇలాంటి వేధింపుల కేసులు పెట్టారని కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ ఆరోపించారు. ఈడీ సమన్లు రద్దు చెయ్యాలని తాను కర్ణాటక హై కోర్టును ఆశ్రయించానని, తన అర్జీని హైకోర్టు కొట్టివేసిందని డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు.

ఇదెక్కడి న్యాయం !

ఇదెక్కడి న్యాయం !

గురువారం రాత్రి 9 గంటలకు ఈడీ అధికారులు సమన్లు ఇచ్చారు. శుక్రవారం మద్యాహ్నం 1 గంటకు ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని అన్నారు. అంత అర్జెంట్ గా తనను విచారణ చెయ్యడానికి ఈడీ అధికారులు ఆసక్తి చూపిస్తున్నారని, కనీసం న్యాయవాదులతో మాట్లాడుకునే అవకాశం ఇవ్వడం లేదని డీకే. శివకుమార్ మండిపడ్డారు. తాను న్యాయవాదులతో మాట్లాడిన తరువాత ఏం చెయ్యాలి ? అనే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటానని డీకే. శివకుమార్ మీడియాకు చెప్పారు.

మాజీ మేయర్, రక్షణా వేదిక

మాజీ మేయర్, రక్షణా వేదిక

బెంగళూరులోని సదాశివనగర్ లోని డీకే. శివకుమార్ ఇంటికి శుక్రవారం ఉదయం బెంగళూరు మాజీ మేయర్ పధ్మావతి, కర్ణాటక రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ వెళ్లి ఆయనతో చర్చించారు. అనంతరం న్యాయవాదులతో మాట్లాడాలని, తాను వెలుతున్నానని మీడియాకు చెప్పిన మాజీ మంత్రి డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.

కపిల్ సిబల్ ఎంట్రీ !

కపిల్ సిబల్ ఎంట్రీ !

ఈడీ సమన్లు జారీ చెయ్యడాన్ని ప్రశ్నిస్తూ డీకే. శివకుమార్ కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు. అయితే కర్ణాటక హైకోర్టు ఏకసభ్య బెంచ్ డీకే. శివకుమార్ అర్జీని కొట్టివేసింది. ఈ సమయంలో డీకే. శివకుమార్ హైకోర్టు అత్యున్నత బెంచ్ ను ఆశ్రయించడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సుప్రీం కోర్టు న్యాయవాది కపిల్ సిబల్ మాజీ మంత్రి డీకే. శివకుమార్ కేసు వాదించడానికి సిద్దం అయ్యారని తెలిసింది. ఇప్పటికే డీకే. శివకుమార్ న్యాయవాది కపిల్ సిబల్ తో మాట్లాడారని సమాచారం.

 ఢిల్లీలో ఐటీ దాడులు, రూ. 8 కోట్లు !

ఢిల్లీలో ఐటీ దాడులు, రూ. 8 కోట్లు !

ఢిల్లీలోని డీకే. శివకుమార్ ఇంటి మీద దాడులు చేసిన ఆదాయపన్ను (ఐటీ) అధికారులు సుమారు రూ. 8 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదుకు సరైన ఆధారాలు చూపించలేదని ఐటీ శాఖ అధికారులు డీకే. శివకుమార్ మీద ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు సమన్లు జారీ చేశారు. ఈడీ అధికారలు ఇచ్చిన సమన్లు రద్దు చెయ్యాలని డీకే. శివకుమార్ కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు. డీకే. శివకుమార్ అర్జీని కర్ణాటక హై కోర్టు కొట్టివేసింది.

రేప్ లు, హత్యాలు చేశానా ?

రేప్ లు, హత్యాలు చేశానా ?

నేను రేప్ లు చెయ్యలేదు, హత్యలు చెయ్యలేదు, మోసం, దగ చెయ్యలేదు, ఎవరి డబ్బులు లూటీ చెయ్యలేదు, మా పార్టీకి చెందిన శాసన సభ్యులను కాపాడుకున్నందుకు సమన్లు ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ఆరోపించారు. విచారణకు హాజరవుతున్న మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు ప్రశ్నల వర్షం కురిపించడానికి ఈడీ అధికారులు సిద్దం అయ్యారు.

English summary
Karnataka Congress leader, former minister DK Shivakumar said that, the summons by ED is political interested. He will meet the lawyer and then speak to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X