బీజేపీకి శాపం పెట్టిన ట్రబుల్ షూటర్ తల్లి, ఐటీ దాడులు, ఈడీ కేసులు ! ఏం బాగుపడుతారు ?
బెంగళూరు: నా కుమారుడికి ఈ పరిస్థితి రావడానికి బీజేపీ నాయకులే కారణం అని ట్రబుల్ షూటర్, కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ తల్లి గౌరమ్మ కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడు డీకే. శివకుమార్ ను వేదింపులకు గురి చేస్తున్న బీజేపీ నాయకులకు ఇంత కంటే దారుణమైన పరిస్థితి ఉస్తుందని, వాళ్లు ఏం బాగుపడుతారని గౌరమ్మ శాపనార్థాలు పెట్టారు. డీకే. శివకుమార్, ఆయన కుటుంబ సభ్యుల మీద ఐటీ దాడులు జరగడంతో ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
తాగుబోతులకు
షాక్,
ఆధార్
లింక్
!
పీకలదాక
తాగితే
డ్రాప్
చెయ్యాలి,
సరుకులు
ఫ్రీ,
జోక్
కాదు
!
అక్రమ కేసులు !
డీకే. శివకుమార్ తండ్రి సమాధి దగ్గర పిండం పెట్టడానికి ఆయన తల్లి గౌరమ్మ అలహళ్ళికి వచ్చారు. ఈ సందర్బంగా డీకే. శివకుమార్ తల్లి గౌరమ్మ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడు డీకే. శివకుమార్ ఎదుగదలను జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు ఆయన్ను లేనిపోని అక్రమ కేసుల్లో ఇరికించారని గౌరమ్మ ఆరోపించారు.
బీజేపీకి శాపనార్థాలు
తన కుమారుడు డీకే. శివకుమార్ ను ఇలా వేధింపులకు గురి చేస్తున్న నాయకులు ఏం బాగుపడుతారని గౌరమ్మ శాపనార్థాలు పెట్టారు. లేనిపోని కేసుల్లో డీకే. శివకుమార్ ను ఇరికిస్తున్నారని, వాళ్లు (బీజేపీ నాయకులు) నా కుమారుడిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దేవుడు వారిని క్షమించరని గౌరమ్మ మండిపడ్డారు.
డీకే బ్రదర్స్
డీకే. శివకుమార్ తండ్రికి పిండం పెట్టడానికి ఈ వినాయక చవితి పండగకు సమాధి దగ్గరకు రాలేదు. డీకే. శివకుమార్ కుమారుడు వెళ్లి తాత సమాధి దగ్గర పిండం పెట్టి పూజలు చేశాడు. ప్రతి సంవత్సరం డీకే. శివకుమార్, ఆయన సోదరుడు, బెంగళూరు గ్రామీణ ఎంపీ (కాంగ్రెస్) డీకే. సురేష్ తండ్రి సమాధి దగ్గర పిండం పెట్టి పూజలు చేసేవారు.
విలపించిన ట్రబుల్ షూటర్
ఈ సంవత్సరం డీకే. శివకుమార్ సోదరులు వారి తండ్రి సమాధి దగ్గర పూజలు చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. డీకే. శివకుమార్ కూడా మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి సమాధి దగ్గర పూజలు చెయ్యడానికి తనకు అవకాశం లేకుండా పోయిందని కన్నీరు పెట్టుకున్నారు.
తల్లీ కొడుకును నమ్మలేదు
కొడుకును తల్లి నమ్మకూడదా ? తల్లిని కొడుకు నమ్మకూడదా ? అధికారులు ఇలాగే అంటున్నారని, వారి తీరు చూస్తేంటే చాల భాదగా ఉందని మాజీ మంత్రి డీకే. శివకుమార్ విచారం వ్యక్తం చేశారు. డీకే. శివకుమార్ మీద కేసు నమోదు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) అధికారులు ఆయన ఆస్తితో పాటు ఆయన తల్లి గౌరమ్మ ఆస్తులు అటాచ్ చేశారు.