సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో డీకే అదుర్స్, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫిదా, కులదైవం సాక్షిగా!
న్యూఢిల్లీ/బెంగళూరు: సుమారు 50 రోజులు జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ సరికొత్త లుక్ తో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రత్యర్థి పార్టీ నాయకులను ఆకర్షిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో డీకే. శివకుమార ఇప్పుడు కర్ణాటకతో పాటు కాంగ్రెస్ పార్టీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కేసు విచారణ కోసం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరౌతున్న డీకే. శివకుమార్ తన కొత్త గెటప్ తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కుల దైవం సాక్షిగా గడ్డం తియ్యాలని డీకే. శివకుమార్ నిర్ణయించారు.
కబాలి రజనీకాంత్ గెటప్
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన నటించిన కబాలి సినిమాలో సరికొత్త లుక్ తో ఫ్యాన్స్ కు కట్టిపడేశారు. కబాలి సినిమాలో రజనీకాంత్ గెటప్ లాగే డీకే శివకుమార్ తెలుపు, నలుపు రంగులో ఉన్న వెంట్రుకలతో జైల్లో గడ్డం పెంచుకుని బెయిల్ మీదకు బయటకు వచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ స్టైల్ లో డీకే. శివకుమార్ తన అభిమానులను ఆకర్షిస్తున్నారు.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్
ఫ్యాషన్ లోకంలో నలుపు, తెలుపు రంగులో గడ్డం పెంచుతున్నవారిని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో పిలుస్తుంటారు. ఇప్పుడు డీకే. శివకుమార్ ను ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో మీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సూపర్ అంటున్నారు.
నేడు బెంగళూరుకు డీకే
ప్రతినిత్యం గడ్డం నీట్ గా షేవ్ చేసుకుని దర్శనం ఇచ్చే డీకే. శివకుమార్ ఇప్పుడు గడ్డం పెంచుకుని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో దర్శనం ఇస్తున్నారు. సుమారు 50 రోజులు ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న డీకే. శివకుమార్ మూడు రోజుల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చారు. మూడు రోజుల నుంచి ఢిల్లీలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాదులతో భేటీ అవుతున్న డీకే. శివకుమార్ శనివారం బెంగళూరు వస్తున్నారు. డీకే. శివకుమార్ కు స్వాగతం చెప్పడానికి ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.
కుల దైవం సాక్షిగా !
డీకే. శివకుమార్ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత గడ్డం పెట్టుకుని తిరుగుతున్నారు. బెంగళూరు వచ్చిన తరువాత తన కులదైవాన్ని దర్శించుకున్న తరువాత డీకే. శివకుమార్ నీట్ గా గడ్డం షేవ్ చేస్తారని ఆయన ముఖ్య అనుచరులు అంటున్నారు. మొత్తం మీద ట్రుబల్ షూటర్ డీకే. శివకుమార్ న్యూ లుక్ కు సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.