వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు చాలెంజ్ చేసిన డీకే నేడు తీహార్ జైల్లో, మాజీ సీఎం, సొంత సోదరుడు ఎంట్రీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ఱాటకలో 15 శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడానికి కారణమైన రెబల్ ఎమ్మెల్యేల సంగతి ఈ ఉప ఎన్నికల్లో చూస్తా అంటూ చాలెంజ్ చేసిన మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ తీహార్ జైల్లో ఉన్నారు. తమ మీద చాలెంజ్ చేసిన నాయకుడు జైల్లో ఉన్నారని, ఇప్పుడు ఆయన ఏం చేస్తారని కొందరు రెబల్ ఎమ్మెల్యేలు అంటున్నారు. డీకే. శివకుమార్ మొట్టమొదట చాలెంజ్ చేసింది సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం అయిన మాజీ మంత్రి రమేష్ జారకిహోళి. ఇప్పుపడు రమేష్ జారకిహోళిని ఓడించడానికి స్వయంగా ఆయన సోదరుడితో పాటు మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దం అయ్యారు.

ఆ ఎమ్మెల్యేల విషయంలో సీఎంకు అమిత్ షా ఏం చెప్పారు, నామినేషన్లకు నో చాన్స్ !ఆ ఎమ్మెల్యేల విషయంలో సీఎంకు అమిత్ షా ఏం చెప్పారు, నామినేషన్లకు నో చాన్స్ !

మాజీ సీఎం సిద్దరామయ్య ఎంట్రీ

మాజీ సీఎం సిద్దరామయ్య ఎంట్రీ

ఉప ఎన్నికల్లో నీ సంగతి చూస్తా అని రమేష్ జారకిహోళి మీద చాలెంజ్ చేసిన డీకే. శివకుమార్ ప్రస్తుం తీహార్ జైల్లో ఉన్ననారు. రమేష్ జారకిహోళిని ఓడించే భాద్యత మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ వర్గాలు అప్పగించాయని వెలుగు చూసింది. సిద్దరామయ్య కచ్చితంగా రమేష్ జారకిహోళిని ఓడిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

సొంత సోదరుడు సై

సొంత సోదరుడు సై

తన సొంత సోదరుడు రమేష్ జారకిహోళి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిందని ఆయన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సతీష్ జారకిహోళి మండిపడుతున్నారు. రమేష్ జారకిహోళిని ఈ ఉప ఎన్నికల్లో ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన సోదరుడు సతీష్ జారకిహోళిని తెర మీదకు తెచ్చారు. ఉప ఎన్నికల్లో రమేష్ జారకిహోళిని ఓడించే భాద్యత మాజీ సీఎం సిద్దరామయ్య, సతీస్ జారకిహోళికి అప్పగించారని సమాచారం.

ఒక్కడే ఇంత చేశాడు

ఒక్కడే ఇంత చేశాడు

సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి రమేష్ జారకిహోళి ప్రధాన కారణం అని ఇంతకు ముందు డీకే. శివకుమార్ బహిరంగంగా ఆరోపించారు. రమేష్ జారకిహోళికి ఉప ఎన్నికల్లో సరైన బుద్దిచెప్పి ఆయన్ను ఇంటికే పరిమితం చేస్తానని చాలెంజ్ చేసిన డీకే. శివకుమార్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. రమేష్ జారకిహోళిని ఓడించే భాద్యత సిద్దరామయ్య, సతీష్ జారకిహోళికి అప్పగించిన కాంగ్రెస్ నాయకులు ఎలాగైనా రమేష్ జారకిహోళిని ఓడించాలని ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.

కొత్త సవాల్

కొత్త సవాల్

డీకే. శివకుమార్ సవాలుతో పాటు రమేష్ జారకిహోళికి మరో కొత్త సవాల్ ఎదురైయ్యింది. ఒక పక్క రాజకీయ గురువు, మరో పక్క సొంత సోదరుడు సతీష్ జారకిహోళి తన ఓటమి మీద శ్రదపెట్టారని తెలుసుకున్న రమేష్ జారకిహోళి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇద్దరి సవాళ్లు ఎదుర్కొని ఎలాగైనా ఉప ఎన్నికల్లతో తన సత్తా చాటుకోవాలని రమేష్ జారకిహోళి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

బీజేపీ దిక్కు

బీజేపీ దిక్కు

కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఈ ఉప ఎన్నికల్లో తన ఓటిమి గురించి ఆలోచిస్తున్నారని పసిగట్టిన రమేష్ జారకిహోళి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బెళగావి జిల్లాతో పాటు సొంత నియోజక వర్గం గోకాక్ లోని బీజేపీ నాయకుల అండదండలు తీసుకోవాలని రమేష్ జారకిహోళి ప్లాన్ వేశారు. బీజేపీ నాయకులను రంగంలోకి దింపి ఇప్పటి నుంచి ప్రచారం చెయ్యాలని రమేష్ జారకిహోళలి స్కెచ్ వేశారు.

English summary
Karnataka former minister DK Shivakumar Who Challenged The By-Election Is Now In Jail, By Election For 15 Constituencies on October 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X