బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ హైకమాండ్ కు చుక్కలు చూపించిన రెబల్ స్టార్, నా ఇంటికే: నిజజీవితంలో, పార్టీ భూస్థాపితం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: స్యాండిల్ వుడ్ సినిమా రంగంలోనే కాదు, నిజ జీవితంలో, రాజకీయాల్లో కూడా తాను రెబల్ స్టార్ అని అంబరీష్ నిరూపించుకున్నారు. రాజీకీయాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ అంబరీష్ 2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు ఆ పార్టీ నాయకులకు చుక్కలు చూపించారు. వారం రోజుల పాటు అంబరీష్ తన నిర్ణయాన్ని ప్రకటించకుండా చివరి నిమిషం వరకూ అందర్నీ అయోమయానికి గురి చేశారు.

కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి

సాండ్యిల్ వుడ్ సినీరంగంలో ఎంతో బిజీగా ఉన్న సమయంలో రెబల్ స్టార్ అంబరీష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో సొంత జిల్లా మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి అంబరీష్ మూడుసార్లు భారీ మెజారిటీతో ఎంపీ అయ్యారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో అంబరీష్ మంత్రిగా పని చేశారు.

90 వేల ఓట్ల మెజారిటీ

90 వేల ఓట్ల మెజారిటీ

2013లో కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మండ్య శాసన సభ నియోజక వర్గం నుంచి రెబల్ స్టార్ అంబరీష్ పోటీ చేశారు. బీజేపీ, జేడీఎస్ పార్టీల అభ్యర్థుల మీద అంబరీష్ 90, 329 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రి వర్గంలో అంబరీష్ మంత్రిగా పని చేశారు.

ఒక్క మాట చెప్పలేదు!

ఒక్క మాట చెప్పలేదు!

సిద్దరామయ్య ప్రభుత్వంలోనే మంత్రిగా పని చేసిన అంబరీష్ సినిమా రంగంలో, నిజజీవతంలోనూ తీరికలేకండాగడిపారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రివర్గ విస్తరణ చేసే సమయంలో ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా అంబరీష్ ను మంత్రి పదవి నుంచి తప్పించారు.

మంత్రి పదవా తొక్కా!

మంత్రి పదవా తొక్కా!

మంత్రి పదవి నుంచి తప్పించడంతో అంబరీష్ కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. ప్రజలకు సేవ చెయ్యాలంటే మంత్రి పదవి అవసరం లేదని బహిరంగంగా అన్నారు. సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడిన అంబరీష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని నిర్ణయించారు. అయితే సన్నిహితులు, స్నేహితులు నచ్చచెప్పడంతో అంబరీష్ శాంతించారు. అనంతరం అంబరీష్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

హైకమాండ్ కు సినిమా

హైకమాండ్ కు సినిమా

2018 శాసన సభ ఎన్నికల్లో అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అంబరీష్ మండ్య నుంచి పోటీ చేస్తారు అనిభావించారు. అయితే సీన్ మారిపోయింది. అందరూ బీఫాం కోసం కేపీసీసీ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. అవసరం అయితే బీఫాం నా ఇంటికే వస్తుందని, తాను మాత్రం వెళ్లనని అంబరీష్ తేల్చి చెప్పారు. అంబరీష్ పేరుతో బీఫాం సిద్దం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ ఆయన రాకకోసం ఎదురు చూసింది. అయితే అంబరీష్ ఎంతవరకూ రాకపోవడంతో బీఫాం తీసుకుని ఆయన ఇంటికే వెళ్లారు. తనకు అనారోగ్యంగా ఉందని, ఎన్నికల్లో పోటీ చెయ్యలేనని అంబరీష్ బాంబుపేల్చడంతో కాంగ్రెస్ నాయకులు ఖంగుతిన్నారు.

కాంగ్రెస్ భూస్థాపితం

కాంగ్రెస్ భూస్థాపితం

ఒక్కమాట కూడా చెప్పకుండా మంత్రి పదవి నుంచి తప్పించారని రగిలిపోయిన అంబరీష్ ఎన్నికల ప్రచారానికి దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి నా మద్దతులేదని అంబరీష్ బహిరంగంగా ప్రకటించారు. మండ్య జిల్లాలో అంబరీష్ అభిమానులు జేడీఎస్ కు బహిరంగంగా ప్రచారం చేశారు. అంబరీష్ దెబ్బతో మండ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న నియోజక వర్గాల్లో సైతం అభ్యర్థులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అంబరీష్ దెబ్బకు మండ్య జిల్లలో కాంగ్రెస్ పార్టీకి కొలుకోలేని దెబ్బపడింది.

English summary
Karnataka Former Minister and Kannada senior actor M.H.Ambareesh no more. Here is a remember of 2018 Karnataka assembly election. Ambareesh not contested for election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X