వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ మాజీ ఎమ్మెల్యే, కూలిపని చేస్తూ మృతి, అనారోగ్యంతో ఉన్నా పట్టించుకోలేదు !

బీజేపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాడుఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ, 800 ఓట్ల తేడాతో ఓటమిరబ్బరు తోటలో కూలి పని చేస్తూ అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే మృతి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసి తరువాత ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన కూలి పని చేస్తూ అనారోగ్యంతో మరణించిన ఘటన కర్ణాటకలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యేను ఎవ్వరూ పట్టించుకోలేదు. మంగళూరు సమీపంలోని సుళ్యకు చెందిన బాకికాళ హుక్కప్ప (65) సోమవారం (నవంబర్ 20) తేదీ మరణించారు.

1983లో కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో హుక్కప్ప బీజేపీ నుంచి పోటీ చెయ్యాలని సిద్దం అయ్యారు. బీజేపీ టిక్కెట్ సంపాధించి సుళ్య శాసన సభ నియోజక వర్గం నుంచి హుక్కప్ప పోటీ చేసి విజయం సాధించారు. 1983 నుంచి 1985వ వరకు హుక్కప్ప ఎమ్మెల్యేగా పని చేశారు.

Karnataka former MLA of Sullia Bakikala Hukkappa died today

ఆ సందర్బంలో ఎమ్మెల్యే హోదాలో హుక్కప్ప అనేక అభివృద్ది పనులు పూర్తి చేశారు. 1985లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన హుక్కప్ప కేవలం 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1990లో జేడీఎస్ పార్టీ నుంచి, 1994లో బంగారప్ప కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Karnataka former MLA of Sullia Bakikala Hukkappa died today

చివరికి అమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేశారు. అవినీతికి దూరంగా ఉంటున్న హుక్కప్ప డబ్బు మాత్రం సంపాధించలేదు. 1990 శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్బంలో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో హుక్కప్ప రూ. 250 బ్యాంకు బ్యాలెన్స్, ఆయన భార్యకు రూ. 4, 000 విలువైన బంగారు కమ్మలు, చిన్న పోలం సమాచారం ఇచ్చారు. రబ్బరు తోటలో దినసరి కూలిగా పని చేస్తూ కుటుంభాన్ని పోషిస్తున్న మాజీ ఎమ్మెల్యే హుక్కప్ప అనారోగ్యంతో సోమవారం మరణించారు.

English summary
Former MLA of Sullia Bakikala (65) Hukkappa died today. He was suffering from illness for several days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X