బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక మాజీ స్పీకర్ బావిలో కప్ప, ఆ ఫ్యామిలీకే సరిపోతుంది, సంతోష పెట్టారు, బీజేపీ లీడర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ బావిలో కప్పలాంటి వారని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సీటీ. రవి మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని నెహ్రూ కుటుంబ సభ్యులను సంతోష పెట్టడానికే మాజీ స్పీకర్ రమేష్ కుమార్ మాట్లాడుతుంటారని బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి మండిపడుతున్నారు.

బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సీటీ. రవి మాజీ స్పీకర్ రమేష్ కుమార్ మీద విమర్శలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు. మాజీ స్పీకర్ రమేష్ మాటలు నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలాంటి వారికి సరిపోతాయని, ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడవని సీటీ. రవి అన్నారు.

Karnataka former Speaker Congress MLA Ramesh Kumar Is Like Frog In The Well, BJP Leader CT Ravi.

కాంగ్రెస్ మాయా ప్రపంచం నుంచి బయటకు వచ్చి చూస్తే ఈ దేశం కోసం ఆర్ఎస్ఎస్ ఏం చేసిందో మీకు అర్థం అవుతోందని మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కు సీటీ. రవి సూచించారు. ఈ దేశం కోసం ఆర్ఎస్ఎస్ నాయకులు ఎంతో త్యాగం చేశారనే విషయం మీకు అర్థం కావడం లేదని సీటీ రవి అన్నారు.

స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తరువాత రమేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్బంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ మతతత్వ పార్టీని ఎదుర్కోవడానికి మనం అందరూ మానసికంగా సిద్దం కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పాలన ఉందని, దేశం మొత్తం కాషాయమయం అయిపోతే ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటారని మాజీ స్పీకర్ రమేష్ కుమార్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు అన్ని సంస్థల్లో జోక్యం చేసుకుని ప్రజాప్రభుత్వాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ స్పీకర్ రమేష్ కుమార్ ఆరోపించారు. బీజేపీ మీద విమర్శలు చేసిన మాజీ స్పీకర్ రమేష్ కుమార్ బావిలో కప్ప అంటూ బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి ట్వీట్ చేశారు.

English summary
Karnataka former Speaker Congress MLA Ramesh Kumar Is Like Frog In The Well, BJP Leader CT Ravi. In his tweet Ravi mentioned, His World is limited to Pygmies like Nehru, Indira, Rajiv, Sonia & Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X