వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆడియో టేపుల్లో ఉన్న మాటలు నావే, సీఎం ఎడిటింగ్ చేశారు, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు!

|
Google Oneindia TeluguNews

హుబ్బళి (కర్ణాటక): కర్ణాటకలోని గురుమిఠ్కల్ జేడీఎస్ శాసన సభ్యుడు నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో తాను మాట్టాడిన మాటలు నిజమే అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు బీఎస్. యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. శరణ్ గౌడతో తాను మాట్టాడటానికి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కారణమని, వారి కుళ్లు రాజకీయాలు చేశారని బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు.

మాజీ సీఎంల నియోజక వర్గాలకు బంఫర్ ఆఫర్: ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం!మాజీ సీఎంల నియోజక వర్గాలకు బంఫర్ ఆఫర్: ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం!

హుబ్బళిలో మీడియాతో మాట్లాడిన బీఎస్. యడ్యూరప్ప ఆపరేషన్ కమలలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేపుల్లో ఉన్న మాటలు తనవే అని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం ఎడిటింగ్ చేశారు

సీఎం ఎడిటింగ్ చేశారు

ఆడియో టేపుల్లో తాను మాట్టాడిన మాటలు వేరేవిధంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి కుమారస్వామి తన మాటలను ఎడిటింగ్ చేసి మీడియాకు విడుదల చేసి కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు.

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. అసలు ఆడియో టేపును సోమవారం తాను అసెంబ్లీ సమావేశంలో విడుదల చేస్తానని, అప్పుడు నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయని బీఎస్. యడ్యూరప్ప అన్నారు.

సూట్ కేస్ రాజకీయాలు

సూట్ కేస్ రాజకీయాలు

సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణ చేసిన వ్యాఖ్యలపై బీఎస్. యడ్యూరప్ప మండిపడ్డారు. తమది సూట్ కేస్ పార్టీ అని ఆరోపించిన మంత్రి రేవణ్ణ ఎవరు సూట్ కేస్ రాజకీయాలు చేస్తున్నారు ? అని ప్రజలకు బహిరంగంగా చెప్పాలని బీఎస్. యడ్యూరప్ప డిమాండ్ చేశారు.

రాజీనామా ఎప్పుడు ?

రాజీనామా ఎప్పుడు ?

ఆడియో టేపుల్లో మాటలు తనవే అని నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఎస్. యడ్యూరప్ప మీడియాకు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఎప్పుడు రాజీనామా చేస్తారో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

English summary
Karnataka BJP president B.S.Yeddyurappa clarification operation kamala. Chief Minister H.D.Kumaraswamy on February 8 released audio of operation kamala. B.S.Yeddyurappa talking with JD(S) MLA son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X