వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని, సీఎం, ఆర్ఎస్ఎస్ ను కించపరిచి సోషల్ మీడియాలో పోస్టు, ప్రభుత్వ ఉద్యోగి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, ఆర్ఎస్ఎస్ ను కించపరిచి పోస్టులు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని, ముఖ్యమంత్రి, ఆర్ఎస్ఎస్ ను కించపరిచి ఫేస్ బుక్, వాట్సాప్ లో సందేశాలు పంపించాడని కర్ణాటక పోలీసులు తెలిపారు.

దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ తాలుకాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని శనివారం పోలీసులు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, ఆర్ఎస్ఎస్ ను కించపరిచిన మహేష్ అతని ఫేస్ బుక్ లో పోస్టు చేసి, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

Karnataka government employee arrested for offensive post against PM Modi in social media

ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యడియూరప్ప, ఆర్ఎస్ఎస్ ను కించపరిచిన మహేష్ ఫేస్ బుక్ లో మెసేజ్ లు పంపిస్తున్నాడని ఆరోపిస్తూ హిందూ జాగరణ వేదిక కడబ విభాగం నాయకుడు వెంకటరమణ కోడింబాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు విచారణ చేసిన పోలీసులు మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేసి చివరికి అరెస్టు చేశారు. మహేష్ ను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తప్పించాలని, ప్రధాని మోడీ, సీఎం యడియూరప్పతో పాటు ఆర్ఎస్ఎస్ ను కించపరిచిన అతని మీద కఠిన చర్యలు తీసుకోకుంటే దక్షిణ కన్నడ జిల్లా బంద్ చేస్తామని, తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని హిందూ జాగరణ వేదిక నాయకులు హెచ్చరించారు.

English summary
Karnataka: Kadaba Police arrested government employee for offensive post against PM Narendra Modi, Karnataka Chief Minister B S Yediyurappa and RSS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X