వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎఎస్ రవి మృతి కేసు ఎఫెక్ట్: సిద్దు మంత్రి వర్గంలో చీలిక

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసు దర్యాప్తు అంశం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. మంత్రులతో పాటు, శాసన సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎలాగైనా సిద్దు సిటుకు ఎసరు పెట్టాలని ప్రయత్నిస్తున్న జేడీఎస్ నాయకులు ఏమి జరుగుతుందా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఐఏఎస్ అధికారి రవి కేసు సీబీఐకి అప్పగించనవసరం లేదు, సీఐడితో దర్యాప్తు చేయిస్తే చాలు అని కర్ణాటక హొంశాఖ మంత్రి కే.జే. జార్జ్ పట్టు బడుతున్నారు. ఆయనకు సీఎం సిద్దరామయ్యతో పాటు కొందరు మంత్రులు మద్దతు పలుకుతున్నారు. గురువారం కొందరు మంత్రులు కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని బహిరంగంగా మీడియా ముందు చెప్పారు.

DK Ravi

ఈ విషయం తెలుసుకున్న సీఎం సిద్దరామయ్య ఉలిక్కిపడ్డారు. గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు అత్యవసరంగా మంత్రి వర్గ సమావేశం జరుగుతుందనే సమాచారం ఇచ్చారు. సిద్దును ఆ సీటు నుండి కింద కుదించి, దళితుడైన పరమేశ్వర్‌ను సీఎం చెయ్యాలని ఇంతకాలం ఎదురు చూస్తున్న ఒక వర్గం ఇప్పుడు మంచి అవకాశం లభించిందని భావిస్తున్నారు. సిద్దరామయ్య, జార్జ్ మీద అధిష్టానికి ఫిర్యాదు చెయ్యడానికి సిద్దమవుతున్నారు. జార్జ్ మీద ఆరోపణలు రావడం ఎదిరి వర్గానికి అవకాశం ఇస్తోంది.

బుధవారం రాత్రి ధర్నా నిర్వహించిన ప్రతిపక్షాలు..............!

మంగళవారం రాత్రి శాసన సభ, శాసన మండలిలో నిరవదిక ధర్నా నిర్వహించిన ప్రతిపక్షాలు బుధవారం రాత్రి పూర్తిగా ధర్నా నిర్వహించారు. బుధవారం రాత్రి బీజేపీ, జేడీఎస్ శాసన సభ్యులు, ఎంఎల్సీలు శాసన సభ, శాసన మండలిలో నిరవదిక ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించే వరకు తాము ధర్నా కొనసాగిస్తామని వారు తేల్చి చెప్పారు.

English summary
Karnataka government is divided on handing over the probe to the CBI in the DK Ravi death case. Chief Minister and his supporters feel that a CBI probe must, But Home Minister K.J.George have not been in favor of a probe
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X