బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో మరో స్కాం, చీటింగ్ కేసు సీఐడీకి: క్యాబ్ లు, కార్లు ఇస్తాం, ఎల్లో ఇండియా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ఐఎంఏ స్కాం తరహాలో మరో స్కాం గుర్తించామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజలను మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న ఆ సంస్థలపై విచారణ చేయించాలని నిర్ణయించామని, కేసు సీఐడీకి అప్పగిస్తామని కర్ణాటక రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ అన్నారు. ఐఎంఏ స్కాం తరహాలోనే ఈ సంస్థలు కూడా ప్రజలను మోసం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాయని మంత్రి. అశోక్ అరోపించారు.

అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!

ఎల్లో ఇండియా ఎక్స్ ప్రెస్

ఎల్లో ఇండియా ఎక్స్ ప్రెస్

ఎల్లో ఇండియా ఎక్స్ ప్రెస్, ఎల్లో ఇండియా పైనాన్స్ తదితర పేర్లతో అమాయకులు, పేదలను టార్గెట్ చేసుని వారి దగ్గర డిపాజిట్లు సేకరించి మోసం చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఆర్. అశోక్ ఆరోపించారు. ఈ విదంగా వసూలు చేసిన డిపాజిట్లతో ప్రజలు మోసపోయే అవకాశం ఉందని మంత్రి ఆర్. అశోక్ ఆరోపించారు.

కార్లు, క్యాబ్ లు ఇస్తాం

కార్లు, క్యాబ్ లు ఇస్తాం

మీ పేరుతో కార్లు లేదా క్యాబ్ లు బుక్ చేస్తామని ప్రజలను ఈ సంస్థలు మోసం చేస్తున్నాయని తెలిసిందని మంత్రి ఆర్. అశోక్ అన్నారు. మీ నగదు మాకు ఇవ్వండి, కార్లు, క్యాబ్ లు తీసిస్తామని, నెలకు రూ. 25 వేలు లాభం వస్తుందని నమ్మించి సుమారు 2 వేల మంది వీరు నగదు డిపాజిట్లు సేకరించారని మంత్రి ఆర్. అశోక్ ఆరోపించారు.

సీఐడీ విచారణ

సీఐడీ విచారణ

ప్రజలను నమ్మించి ఈ విదంగా ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకూ సేకరించారని మంత్రి ఆర్. అశోక్ ఆరోపించారు. ప్రజలకు మాట ఇచ్చినట్లు వీరు తిరిగి సొమ్ము చెల్లించలేదని, వారికి ఇవ్వడం ఈ సంస్థలకు సాధ్యం కాలేదని, ఇదో పెద్ద కుంభకోణం అని మంత్రి ఆర్. అశోక్ ఆరోపించారు. అందుకే ఈ కేసు విచారణ సీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ఆర్. అశోక్ వివరించారు.

నెలకు రూ. 2 కోట్లు

నెలకు రూ. 2 కోట్లు

సంస్థలు ప్రజలకు చెప్పిన ప్రకారం క్యాబుల్లో లాభాలు రావడానికి అవకాశం ఉంది. అయితే ప్రతి నెల రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలు లాభం వచ్చే అవకాశం లేదని మంత్రి ఆర్. అశోక్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వారి ఆశలు నెరవేరాలంటే నెలకు రూ. 2 కోట్లు అవసరం అవుతుందని, ఆ డబ్బు ఈ సంస్థలు ఎలా తెస్తాయని మంత్రి ఆర్. అశోక్ ప్రశ్రించారు.

చీటింగ్ సంస్థలు

చీటింగ్ సంస్థలు

క్యాబ్ లు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని ఇప్పటికే పోలీసుల విచారణలో వెలుగు చూసిందని, ఇలాంటి సంస్థల మీద కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆర్. అశోక్ హెచ్చరించారు. సుమారు రూ. 60 కోట్ల వరకు ఈ చీటింగ్ సంస్థలు ప్రజల నుంచి సేకరించాయని విచారణలో వెలుగు చూసిందని, ఇలాంటి సంస్థల దగ్గర పెట్టుబడులు పెట్టి తిరిగి వాటిని తీసుకోవడం చాల కష్టం అని, అందుకే ఈ కేసు సీఐడీకి అప్పగిస్తామని మంత్రి ఆర్. అశోక్ అన్నారు. ఐఎంఏ స్కాం తరహాలో మరో కొన్ని చీటింగ్ సంస్థల పేర్లు బయటకు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

English summary
Karnataka government ordered for CID probe on Rs 60 crore fraud case. Probe handover to CID after the report from police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X