బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: నిండుగర్బిణి.....వాట్సాప్ వీడియో కాల్ తో కాన్ఫు, టెక్కీ, లాయర్ సాహసం, తల్లి, బిడ్డ, గ్రేట్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హుబ్బళి/ హావేరి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బతో చాలావరకు ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడటంతో సామాన్య ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా వైద్యులు అందుబాటులో లేకపోవడం, ఆసుపత్రికి వెళ్లడానికి సరైన టైమ్ లో అంబులెన్స్ రాకపోవడంతో ఓ నిండు గర్బిణి నానా ఇబ్బందులు ఎదుర్కొనింది. బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళా టెక్కీ, ఓలాయర్, ఓ ఇంజనీరు, సాటి మహిళలు కలిసి ఎక్కడో ఉంటున్న ఓ లేడీ డాక్టర్ సూచనలు, సలహాలతో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా నిండు గర్బిణికి కాన్పు చేసి తల్లి, బిడ్డను క్షేమంగా రక్షించారు.

I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!

 కరోనా దెబ్బతో లాక్ డౌన్

కరోనా దెబ్బతో లాక్ డౌన్

కర్ణాటకలోని హావేరి జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదౌతున్నాయి. హావేరి జిల్లాలోని హానగల్ పట్టణంలో కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ అమలు చేశారు. హానగల్ పట్టణంలోని కిత్తూరు రాణి చెన్నమ్మ రోడ్డులోని వాసవి అనే మహిళ నివాసం ఉంటున్నది. వాసవి నిండు గర్బణి.

 నో అంబులెన్స్ .... నో డాక్టర్

నో అంబులెన్స్ .... నో డాక్టర్

బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళ టెక్కీ లాక్ డౌన్ కారణంగా సొంత ఊరు అయిన హానగల్ కు వెళ్లింది. ఆమె వాసని నివాసం ఉంటున్న రోడ్డులోనే నివాసం ఉంటున్నది. ఇదే రోడ్డులో ఓ లేడీ ఇంజనీరు, మహిళా న్యాయవాది, బాగా చదువుకున్న కొందరు మహిళలు నివాసం ఉంటున్నారు. వాసవికి పురుటి నొప్పులు వచ్చాయి. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేస్తే లాక్ డౌన్ కారణంగా అంబులెన్స్ సైతం వాసవి ఉంటున్న ఇంటికి దగ్గరకు వెళ్లలేదు. వాసవికి వైద్య పరీక్షలు చెయ్యడానికి చుట్టుపక్కల వైద్యులు కూడా అందుబాటులో లేకుండా పోయారు.

 వాట్సాప్ వీడియో కాల్

వాట్సాప్ వీడియో కాల్

నిండు గర్బిణి వాసవి నివాసం ఉంటున్న రోడ్డులోనే నివాసం ఉంటున్న టెక్కీ స్నేహితురాలు అయిన డాక్టర్ ప్రియాంక హుబ్బళిలోని ప్రముఖ కిమ్స్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. వాసవికి పురుటి నొప్పులు ఎక్కువ అయ్యాయని తెలుసుకున్న ఆ వీధిలోని మహిళలు అందరూ ఆమె ఇంటికి చేరుకుని ధైర్యం చెప్పారు. వెంటనే హుబ్బళిలోని కిమ్స్ ఆసుపత్రి డాక్టర్ ప్రియాంకుకు వాట్సాప్ లో వీడియో కాల్ చేశారు. డాక్టర్ ప్రియాంక కాన్పు ఎలా చెయ్యాలి అంటూ వీడియో కాల్ లోని ఆమె స్నేహితురాలికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చింది.

 తల్లి, బిడ్డ క్షేమం

తల్లి, బిడ్డ క్షేమం

ఎంతోదూరంలో ఉంటున్న డాక్టర్ ప్రియాంక సూచనలు, సలహాల మేరకు వీడియో కాల్ లో మాట్లాడుతూ సాటి మహిళలు కష్టపడి వాసవికి కాన్పు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాన్పు జరిగిపోవడంతో సాటి మహిళలు ఊపిరిపీల్చుకున్నారు. వాసవి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉండటంతో వీడియో కాల్ ద్వారా కాన్పు చేసిన సాటి మహిళలు ఊపిరిపీల్చుకున్నారు.

 సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

వాసవికి కాన్పు అయిపోయిన తరువాత ఆమె ఇంటి దగ్గరకు అంబులెన్స్ రావడంతో వాసవి, ఆమె బిడ్డను హానగల్ లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీడియో కాల్ ద్వారా కాన్పు చేసిన మహిళలు పండింటి బిడ్డతో ఓ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. మొత్తం మీద డాక్టర్ దగ్గర లేకపోయినా నార్మల్ డెలివరీ చేసిన సాటి మహిళలను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.

English summary
Lockdown: Karnataka Haveri womens helped a pregnant to deliver a baby following doctors instruction through watsapp video call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X