వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో రజనీకాంత్ కాలా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వం, డీజీపీకి ఆదేశం!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాలా సినిమా విడుదలకు కర్ణాటకలో లైన్ క్లియర్

బెంగళూరు: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా విడుదలకు కర్ణాటకలో లైన్ క్లియర్ అయ్యింది. కర్ణాటకలో కాలా సినిమా విడుదలకు చర్యలు తీసుకోవాలని, పోలీసు భద్రత కల్పించాలని మంగళవారం కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంతర ఆదేశాలు జారీ చేసింది.

కావేరీ వివాదం

కావేరీ వివాదం

కావేరీ నీటి పంపిణి విషయంలో తమిళనాడుకు అన్యాయం జరిగిందని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అన్నారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని, అప్పుడే తమిళనాడుకు న్యాయం జరుగుతోందని రజనీకాంత్ మీడియాకు చెప్పారు.

కన్నడ ద్రోహి

కన్నడ ద్రోహి

కావేరీ నీటి పంపిణి విషయంలో రజనీకాంత్ కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడారని, కన్నడిగులను కించపరిచిన రజనీకాంత్ నటించే అన్ని సినిమాలను కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకుంటామని కన్నడ సంఘాల నాయకులు హెచ్చరించారు.

 హైకోర్టుకు నిర్మాతలు

హైకోర్టుకు నిర్మాతలు

కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని ఆ సినిమా నిర్మాతలు, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కాలా సినిమా కర్ణాటకలో విడుదల కాకుంటే తీవ్రస్థాయిలో ఆర్థికంగా నష్టం వస్తుందని హైకోర్టులో మనవి చేశారు.

హైకోర్టు ఆదేశాలు

హైకోర్టు ఆదేశాలు

కర్ణాటకలో కాలా సినిమా విడుదల చెయ్యడానికి అన్ని చర్యలు తీసుకోవాలని, సినిమా థియేటర్ల దగ్గర భద్రత కల్పించాలని కర్ణాటక హైకోర్టు మంగళవారం కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాలా సినిమా విడుదల అయ్యే థియేటర్ల దగ్గర ఆందోళనలు చెయ్యడానికి అవకాశం ఇవ్వరాదని పోలీసులకు హైకోర్టు సూచించింది.

డీజీపీ చూడాలి

డీజీపీ చూడాలి

కాలా సినిమా విడుదల సందర్బంగా పోలీసు భద్రతను డీజేపీ పర్యవేక్షించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాలా సినిమా విడుదల అయ్యే థియేటర్ల దగ్గర తాము ఆందోళన చేస్తామని కన్నడ సంఘాల నాయకులు అంటున్నారు.

English summary
Karnataka High court give indication to state government to give proper protection to Kaala movie in the state. Yesterday Kaala movie producers moved to high court seeking protection over the film release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X