వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ లీడర్ కు బీజేపీ మంత్రి క్షమాపణలు, సిద్దూ పగటి కలలు, బళ్లారి శ్రీరాములు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ పేరుతో తనను అరెస్టు చేశారని, తన తండ్రి సమాధి దగ్గర పిండం పెట్టి పూజలు చెయ్యడానికి అవకాశం ఇవ్వలేదని కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ లీడర్ డీకే. శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. డీకే. శివకుమార్ ఆవేదన అర్థం చేసుకున్నానని, Iam sorry అన్నా అని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి. శ్రీరాములు అన్నారు. డీకే. శివకుమార్ అరెస్టు విషయంలో తాను గుచ్చిగుచ్చి మాట్లాడలేనని, ఆయన తనకు సోదరుడితో సమానం అని మంత్రి బళ్లారి శ్రీరాములు చెప్పారు.

రాజకీయాలు మాత్రమే !

రాజకీయాలు మాత్రమే !

రాజకీయంగా డీకే. శివకుమార్ తనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, తాను ఆయన మాటలకు ధీటుగా సరైన సమాధానం ఇచ్చాను, అవి రాజకీయాలకే పరిమితం అని బళ్లారి శ్రీరాములు అన్నారు. వ్యక్తిగతంగా డీకే. శివకుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆ కోణంలో ఆయన్ను విమర్శించలేదని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు మీడియాకు చెప్పారు.

కష్టకాలంలో డీకేశీ

కష్టకాలంలో డీకేశీ

మాజీ మంత్రి డీకే. శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారని, ఆయన ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారని ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. ఇలాంటి సమయంలో డీకే. శివకుమార్ గురించి గుచ్చి గుచ్చి మాట్లాడటం

అన్నా నన్ను క్షమించు

అన్నా నన్ను క్షమించు

డీకే. శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. చట్టం తనపని తాను చేసుకునిపోతున్నదని, మీకు నా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగివుంటే నన్ను క్షమించు శివకుమార్ అన్నా అంటూ శ్రీరాములు మీడియా ముందు బహిరంగంగా చేతులు ఎత్తి వేడుకున్నారు.

బళ్లారి దెబ్బ !

బళ్లారి దెబ్బ !

బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం సమయంలో బళ్లారి శ్రీరాములు మీద డీకే. శివకుమార్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. డీకే. శివకుమార్ కు బళ్లారి శ్రీరాములు గట్టి కౌంటర్ ఇచ్చారు. బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల్లో శ్రీరాములు సోదరి శాంతా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో తన దెబ్బ చూశావా ? అంటూ డీకే. శివకుమార్ శ్రీరాములను ఉద్దేశించి వ్యంగంగా అన్నారు. అప్పటి నుంచి శ్రీరాములు, డీకే. శివకుమార్ ఒకరి మీద ఒకరు వీలు చిక్కిప్పుడు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

సిద్దరామయ్య పగటి కలలు

సిద్దరామయ్య పగటి కలలు

కర్ణాటకలో మధ్యంత ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. సిద్దరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారని, ఆయన ఆశ నెరవేరదని, బీజేపీ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటుందని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్దరామయ్యను పక్కన పెట్టేసిందని, ఆ విషయం ఆ పార్టీ నాయకులు అందరికీ తెలుసని మంత్రి బళ్లారి శ్రీరాములు వ్యంగంగా అన్నారు.

English summary
Bengaluru: Karnataka Health Minister B Sriramulu apolozise DK Shivakumar in chitradurga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X