బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వైరస్ వచ్చే చాన్స్ లేదు, ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ, మంత్రి బళ్లారి, డోంట్ వర్రీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో వేడి, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని, ఇలాంటి సందర్బంలో కరోనా వైరస్ వ్యాధి (COVID-19) వ్యాపించదని, ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. కర్ణటకలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అందువలన ప్రజలు ధైర్యంగా ఉండాలని మంత్రి బళ్లారి శ్రీరాములు మనవి చేశారు.

అమెరికా నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీరుకి కరోనా వైరస్ వ్యాధి సోకిందని, టెక్కీతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, అందు వలన ప్రజలు ధైర్యంగా ఉండాలని మంత్రి బళ్లారి శ్రీరాములు మనవి చేశారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తి ఆసుపత్రి నుంచి పారిపోవడంతో అతన్ని వెంటాడి పట్టుకున్నామని, డోంట్ వర్రీ అంటూ ప్రజలు ధీమాగా ఉండాలని మంత్రి అన్నారు.

అమ్మాయి రివర్స్, స్వామీజీ మూడో పెళ్లి మటాష్, 420 కేసులు, కండలతో హీరో సల్మాన్ ఖాన్ కు సవాల్!అమ్మాయి రివర్స్, స్వామీజీ మూడో పెళ్లి మటాష్, 420 కేసులు, కండలతో హీరో సల్మాన్ ఖాన్ కు సవాల్!

డబ్బు సమస్య లేదు

డబ్బు సమస్య లేదు

బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని ప్రజలు అంటు వ్యాదులు వ్యాపించకుండా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీరాములు సూచించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆరోగ్య శాఖకు ఎలాంటి డబ్బు (నిధులు) సమస్య లేదని, ఎంత ఖర్చు అయినా సరే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి సంబంధిత అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి శ్రీరాములు తెలిపారు.

కరోనా వైరస్ వ్యక్తి చిక్కాడు

కరోనా వైరస్ వ్యక్తి చిక్కాడు

మంగళూరు నగరంలోని వెన్ లాక్ ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయిన వ్యక్తిని (కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తి) పట్టుకున్నామని, అతనికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. మరోసారి కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తులు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేశామని అన్నారు.

ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాప్ లకు వార్నింగ్

ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాప్ లకు వార్నింగ్

కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తుందని ఆందోళనతో చికిత్స చేయించుకోవడానికి వచ్చే ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బళ్లారి శ్రీరాములు హెచ్చరించారు. అదే విదంగా మాస్క్ లను ఎక్కువ ధరకు విక్రయించే ప్రవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాప్ ల నిర్వహకుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బళ్లారి శ్రీరాములు హెచ్చరించారు.

Recommended Video

Coronavirus: Italy Goes Under Nationwide Lockdown | Oneindia Telugu
ఎయిర్ పోర్టులో ఆకస్మిక తనిఖీలు

ఎయిర్ పోర్టులో ఆకస్మిక తనిఖీలు

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం) దగ్గర కరోనా వైరస్ వ్యాధి నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని సమాచారం సేకరించడానికి మంత్రి బళ్లారి శ్రీరాములు ఆకస్మికంగా భేటీ అయ్యి అక్కడ పరిశీలించారు. విదేశాల నుంచి వస్తున్న వారిని ఎలా పరిశీలిస్తున్నారు ? ఎయిర్ పోర్టులో కరోనా వ్యాధి నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ? అనే పూర్తి సమాచారం తెలుసుకున్న మంత్రి శ్రీరాములు అక్కడి సిబ్బందికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు.

English summary
Karnataka Health Minister Sriramulu said the coronavirus was not spreading to the hotter temperatures in our state. The people of the state should not be afraid of Kovid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X