వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంద స్వామికి షాక్, శిష్యురాలి రేప్ కేసులో బెయిల్ రద్దు, 10 ఏళ్ల క్రితం కేసు, దెబ్బ మీద దెబ్బ !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Day Light Report : 3 Minutes 10 Headlines | Trump impeachment | Medaram Jatara | Nithyananda Bail

బెంగళూరు: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద అలియాస్ నిత్యాందకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2010లో శిష్యురాలి మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందకు అప్పుడు ఇచ్చిన బెయిల్ ను బుధవారం కర్ణాటక హై కోర్టు రద్దు చేసింది. సుమారు 40 సార్లుకు పైగా కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న నిత్యానందకు బెయిల్ రద్దు చెయ్యాలని ఆయన మాజీ కారు డ్రైవర్ లెనిన్ కరుప్పన్ హైకోర్టును ఆశ్రయించాడు. అర్జీ విచారణ చేసిన కర్ణాటక హై కోర్టు నిత్యానంద బెయిల్ బుధవారం ను రద్దు చేసింది.

అక్రమ సంబంధం, భర్త హత్యకు భార్య పక్కాప్లాన్, ప్రియుడితో కలిసి కదులుతున్న రైలు నుంచి తోసేసి!అక్రమ సంబంధం, భర్త హత్యకు భార్య పక్కాప్లాన్, ప్రియుడితో కలిసి కదులుతున్న రైలు నుంచి తోసేసి!

మాజీ కారు డ్రైవర్ రివర్స్

మాజీ కారు డ్రైవర్ రివర్స్

అత్యాచారం కేసులో 2010లో నిత్యానందకు మంజూరు చేసిన జామీను రద్దు చెయ్యాలని ఆయన మాజీ కారు డ్రైవర్ లెనిన్ కరుప్పన్ అర్జీ సమర్పించారు. ఇప్పటి వరకు ఈ కేసులో నిత్యానంద 40 సార్లుకు పైగా కోర్టు విచారణకు హాజరుకాలేదని ఆయన మాజీ కారు డ్రైవర్ లెనిన్ కరుప్పన్ కోర్టులో చెప్పారు.

బెయిల్ రద్దు

బెయిల్ రద్దు

నిత్యానంద కారు డ్రైవర్ లెనిన్ కరుప్పన్ పిటిషన్ ను హై కోర్టు న్యాయమూర్తి జాన్ మైకెల్ విచారణ చేశారు. నిత్యానంద కోర్టు నియమాలను ఉల్లంఘించారని వెలుగు చూడటంతో అత్యాచారం కేసులో ఆయనకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేశారు. గత ఏడాదిన్నర కాలంగా కోర్టు విచారణకు హాజరుకాని నిత్యానందపై విచారణ జరిపాలని, ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రామనగర కోర్టుకు హైకోర్టు న్యాయమూర్తి జాన్ మైకెల్ ఆదేశాలు జారీ చేశారు.

కర్ణాటక ప్రభుత్వం వాదనలు

కర్ణాటక ప్రభుత్వం వాదనలు

కర్ణాటక హైకోర్టు నిత్యానందకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చెయ్యాలని ఆయన మాజీ కారు డ్రైవర్ లెనిన్ సమర్పించిన పిటిషన్ పై కర్ణాటక ప్రభుత్వం నిన్న అభ్యంతరం వ్యక్తం చేసింది. నిత్యానంద ఈ కేసులో మొదటి ముద్దాయి అని, విచారణకు వెంటనే హాజరు కావలసిన అవసరం లేదని, ఎందుకంటే ఫిర్యాదు చేసిన వ్యక్తి కోర్టు విచారణకు సహకరించకుండా ఆలస్యం చేస్తున్నారని, అందుకే విచారణ ఆలస్యం అవుతోందని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

బెయిల్ రద్దు చెయ్యాలంటే !

బెయిల్ రద్దు చెయ్యాలంటే !

శిష్యురాలి మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని, అర్జీదారుడు బెయిల్ రద్దు చెయ్యాలని డిమాండ్ చెయ్యకూడదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జాన్ మైకెల్ నిత్యానంద బెయిల్ ను రద్దు చేశారు.

విదేశాలకు పరార్

విదేశాలకు పరార్

ఇప్పటికే శిష్యురాలి మీద అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద గుజరాత్ లో మైనర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి నిర్బంధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిత్యానంద నకిలీ పాస్ పోర్టు ఉపయోగించి దేశం విడిచి విదేశాలకు (ఈక్విడార్ ) పారిపోయారని ఆరోపణలు ఉన్నాయి. నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారని మంగళవారం కర్ణాటక పోలీసులు హై కోర్టుకు చెప్పారు. అయితే మరుసటి రోజే నిత్యానంద బెయిల్ రద్దు కావడంతో ఆయన శిష్యులు షాక్ కు గురైనారు.

ఒక్క రోజులో నిత్యానంద శిష్యులు షాక్

ఒక్క రోజులో నిత్యానంద శిష్యులు షాక్

నిత్యానంద అందుబాటులో లేకపోవడంతో ఆయనకు తాము నోటీసులు ఇవ్వలేకపోయామని కర్ణాటక పోలీసులు నిన్న (మంగళవారం) హై కోర్టులో చెప్పారు. అయితే నిత్యానంద మహిళా శిష్యురాలు కుమారి అర్చనానంద నోటీసులు స్వీకరించడానికి నిరాకరించారని, అయినా తాము ఆమెకు నోటీసులు అందించామని పోలీసులు హైకోర్టులో చెప్పారు. అయితే తనకు బలవంతంగా నోటీసులు అందించారని నిత్యానంద శిష్యురాలు అర్చనానంద హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చెయ్యడంతో న్యాయమూర్తి పోలీసుల మీద మండిపడిన విషయం తెలిసిందే.

English summary
Karnataka High Court on Wednesday has cancelled the bail granted to Swami Nithyananda in rape case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X