వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంద స్వామిపై రేప్ కేసు, హైకోర్టు స్టే, విచారణకు ఢుమ్మా, న్యాయం కోసం, కారు డ్రైవర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలోని ధ్యాన పీఠం నిత్యానంద స్వామిపై నమోదైన అత్యాచారం (రేప్) కేసు విచారణకు కర్ణాటక హై కోర్టు స్టే ఇచ్చింది. రామనగర సెషన్స్ కోర్టులోని నిత్యానంద మీద నమోదైన రేప్ కేసుకు సంబంధించి ఉన్న పూర్తి వివరాలను వెంటనే తమ ముందు సమర్పించాల రిజిస్టార్ కు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిత్యానంద స్వామిజీ మీద నమోదైన రేప్ కేసు ప్రస్తుతం రామనగర సెషన్స్ కోర్టు విచారణ చేస్తోంది.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

నిత్యానంద శిష్యులు, కారు డ్రైవర్

నిత్యానంద శిష్యులు, కారు డ్రైవర్

తాను దేవ మానవుడు అని స్వయంగా ప్రకటించుకున్న స్వామి నిత్యానంద ఆశ్రమంలో అనేక మంది శిష్యులు ఉన్నారు నిత్యానంద ఆశ్రమంలో యువతులు, వివాహిత మహిళలు ఆయన శిష్యులుగా చలామణి అవుతున్నారు. నిత్యానంద దగ్గర గతంలో చాలకాలం పాటు లెనిన్ అనే వ్యక్తి కారు డ్రైవర్ గా పని చేశాడు.

రేప్ కేసు పెట్టిన కారు డ్రైవర్

రేప్ కేసు పెట్టిన కారు డ్రైవర్

నిత్యానంద దగ్గర తాను కారు డ్రైవర్ గా పని చేస్తున్న సమయంలో ఆయన శిష్యులుపై అత్యాచారం (మహిళలు) చేశారని కారు డ్రైవర్ లెనిన్ కేసు పెట్టారు. నిత్యానంద మహిళలతో అసభ్యంగా ఉన్న సీడీలను లెనిన్ విడుదల చెయ్యడంతో అప్పట్లో కలకలం రేపింది.

జైల్లో నిత్యానంద, కేసు విచారణ

జైల్లో నిత్యానంద, కేసు విచారణ

మహిళపై అత్యాచారం చేశారని నమోదైన కేసులో స్వామి నిత్యానంద, ఆయన ఐదు మంది శిష్యులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తరవాత నిత్యానంద, ఆయన శిష్యులు జామీను మీద జైలు నుంచి విడుదల అయ్యారు. నిత్యానంద, ఆయన శిష్యుల మీద నమోదైన కేసు విచారణ ప్రస్తుతం రామనగర సెషన్స్ కోర్టులో జరుగుతోంది.

కేసు విచారణ ఆలస్యం

కేసు విచారణ ఆలస్యం

నిత్యానందపై నమోదైన కేసు విచారణ రామనగర సెషన్స్ కోర్టులో సక్రమంగా జరగడం లేదని, మరో కోర్టుకు కేసు విచారణ బదిలి చెయ్యాలని కారు డ్రైవర్ లెనిన్ కర్ణాటక హై కోర్టుకు మనవి చేశారు. నిత్యానంద మాజీ కారు డ్రైవర్ లెనిన్ సమర్పించిన అర్జీ విచారణ కర్ణాటక హై కోర్టులో జరిగింది.

కోర్టులో విచారణకు నిత్యానంద ఢుమ్మా

కోర్టులో విచారణకు నిత్యానంద ఢుమ్మా

అత్యాచారం కేసులో నిత్యానంద విచారణకు వరుసగా ఢుమ్మా కొట్టారు. ఈ కేసులో ప్రతివాయిదాకు నిత్యానంద వ్యక్తిగతంగా హాజరుకాకపోయినా పర్వాలేదని, ఆయన హాజరుకాకపోయినా విచారణ మాత్రం కొనసాగుతోందని కొంత కాలం క్రితం రామనగర సెషన్స్ కోర్టు చెప్పింది. రామనగర సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ నిత్యానంద మాజీ కారు డ్రైవర్ లెనిన్ కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు.

నిత్యానంద కేసు వివరాలు ఇవ్వండి

నిత్యానంద కేసు వివరాలు ఇవ్వండి

నిత్యానంద మీద నమోదైన కేసు వివరాలు, ఇప్పటికే విచారణ జరిగిన సమయంలో రికార్డు చేసిన వివరాలను తమ ముందు సమర్పించాలని కర్ణాటక హై కోర్టు రిజిస్టార్ ఆకు ఆదేశాలు జారీ చేసింది. మహిళపై అత్యాచారం చేశారని నిత్యానంద, ఆయన ఐదు మంది శిష్యుల మీద నమోదైన కేసు రామనగర సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పుడు రామనగర సెషన్స్ కోర్టులో జరుగుతున్న కేసు విచారణకు స్టే ఇచ్చిన కర్ణాటక హైకోర్టు కేసు వివరాలను తెప్పించుకుని పరిశీలించనుంది.

English summary
Karnataka high court stay for proceedings in Ramanagar court against controversial self-styled godman Swami Nithyananda. Nityananda has been charge-sheeted in a rape case proceedings underway at session court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X