బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరో దర్శన్ కు హై కోర్టులో ఊరట: స్టే

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: శాండిల్ వుడ్ చాలెంజింగ్ స్టార్ దర్శన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. బీబీఎంపీకి చెందిన ప్రధాన డ్రైనేజ్ ని ఆక్రమించి ఇంటిని నిర్మించారని బెంగళూరు నగర జిల్లా అధికారి శంకర్ ఆదేశాలతో దర్శన్ కు నోటీసులు జారీ చేశారు.

శాండిల్ వుడ్ హీరో దర్శన్ వేసిన పిటిషన్ ను మంగళవారం కర్ణాటక హై కోర్టు విచారణకు స్వీకరించింది. దర్శన్ న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాది వాదనలు విన్న తరువాత దర్శన్ నివాసం తొలగించరాదని కోర్టు మధ్యంతర ఉత్తర్వూలు జారీ చేసింది.

బెంగళూరు నగర జిల్లా యంత్రంగం రాజరాజేశ్వరినగర్ లోని ఐడియల్ హోమ్స్ లేఔట్ లో తాను అక్రమంగా రాజకాలువ (ప్రధాన డ్రేనేజ్) ఆక్రమించి ఇంటిని నిర్మంచారని ఆరోపిస్తున్నారని దర్శన్ కోర్టును ఆశ్రయించారు.

దర్శన్ 2,100 చదరపు అడుగుల స్థలాన్ని కబ్జా చేసి ఇంటిని నిర్మించారని అధికార యంత్రాంగం నివేదిక అందించింది. ఐడియల్ లేఔట్ లోని 44 ఇళ్లకు అధికార యంత్రంగం ఇది ప్రభుత్వ ఆస్తి అంటూ ఈనెల 22న బోర్డులు పెట్టింది.

Darshan

అందులో హీరో దర్శన్ ఇల్లు ఉంది. జిల్లా యంత్రాంగం తీరుతో విసిగిపోయిన దర్శన్ సోమవారం కర్ణాటక హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వూలు జారీ చేసింది.

హలగేవడరహళ్ళి గ్రామం సర్వే నెంబర్ 38 నుంచి 46 వరకు, సర్వే నెంబర్ 51 నుంచి 56 వరకు 7 ఎకరాల 31 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిలో ఇడియల్ హోమ్స్ సహకార సంఘం పేరుతో కొందరు ప్రయివేట్ వ్యక్తులు అనధికారికంగా లేఔట్ వేశారు.

తరువాత మూడు ఎకరాల 20 గంటల స్థలంలో 32 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఎకరా 38 గుంటల్లో ఇళ్లు, భవనాలు నిర్మించారు. 22 గుంటలు ఆక్రమించి ఎస్ఎస్ ఆసుపత్రి నిర్మించారని, ఎకరా 24 గుంటల స్థలాన్ని రోడ్లకు విస్తరించారని అధికారులు గుర్తించారు.

7 గుంటల స్థలంలో బీబీఎంపీ వాటర్ ట్యాంక్ నిర్మించిందని జాయింట్ కలెక్టర్ జిల్లా యంత్రాంగానికి నివేదిక ఇచ్చారు. ఇందుకు సంబంధించి హీర దర్శన్ కు నోటీసులు జారీ చేశారు. జిల్లా అధికారుల యంత్రాంగం తీరుసరిగా లేదని దర్శన్ కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు.

English summary
Darshan is among 69 people in Bengaluru whose properties are on demolition notice for allegedly encroaching upon storm water drains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X