వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టు ఆవరణంలో న్యాయవాది దారుణ హత్య, 9 ఏళ్లకు ప్రియుడికి జీవిత ఖైదు శిక్ష !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక హై కోర్టు ఆవరణంలో సాటి న్యాయవాది, ప్రేయసిని అతి దారుణంగా హత్య చేసిన న్యాయవాదికి హైకోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. సాటి న్యాయవాదిని కిరాతకంగా హత్య చేసిన న్యాయవాది ఎస్ఎల్. రాజప్ప (34)కు కింది కోర్టు విదించిన శిక్షను హైకోర్టు ఖరారు చేసింది.

9 సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో భాదిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందని సాటి న్యాయవాదులు అంటున్నారు. కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలుకాకు చెందిన రాజప్ప కర్ణాటక హైకోర్టులో న్యాయవాదిగా పని చేసేవాడు. కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలుకా సిగలపాళ్యకు చెందిన నవీనా అనే యువతి బెంగళూరులోని విలన్స్ గార్డెన్ లో నివాసం ఉండేది.

Karnataka High Court upheld the life sentence verdict by trail court against advocate SL Rajappa,

రాజప్ప, నవీనా ఇద్దరూ న్యాయవాదులు. రాజప్ప, నవీనా ఇద్దరూ ప్రేమించుకున్నారు. నవీనా ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రకాష్ శెట్టి దగ్గర ప్రాక్టీస్ చేసేది. సీనియర్ న్యాయవాది ప్రకాష్ శెట్టితో నవీనా చనువుగా ఉంటున్నదని, తనకు దూరం అవుతోందని రాజప్ప అనుమానం పెంచుకున్నాడు.

ఇదే విషయంలో నవీనాతో రాజప్ప కొన్నిసార్లు గొడవ పెట్టుకున్నాడు.తనకు దక్కని ప్రియురాలు నవీనా ఎవ్వరికి దక్కకూడదని నిర్ణయించుకున్న రాజప్ప ఆమె మీద కక్ష పెంచుకున్నాడు. నవీనాను హత్య చెయ్యాలని రాజప్ప ప్లాన్ వేశాడు. సమయం చిక్కినప్పుడు నవీనాను హత్య చెయ్యాలని రాజప్ప నిర్ణయించాడు.

2010 జులై 8వ తేదీన కర్ణాటక హైకోర్టు కారిడార్ లో నడుచుకుంటు వెలుతున్న నవీనా మీద రాజప్ప కత్తితో ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. తీవ్రగాయాలైన నవీనా కుప్పకూలిపోయింది. సాటి న్యాయవాదులు దాడి చేస్తారని ఆందోళన చెందిన రాజప్ప సమీపంలోని బాత్ రూంలోకి వెళ్లి లాక్ చేసుకుని విషం కలిపిన మద్యం చేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు.

సాటి న్యాయవాదులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు వచ్చి బాత్ రూం డోర్ పగలగొట్టి రాజప్పను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన నవీనా హైకోర్టు ఆవరణం కారిడార్ లోనే ప్రాణాలు విడిచింది. రాజప్ప ఆత్మహత్య చేసుకునే ముందు అతని జోబులో డెత్ నోట్ రాసిపెట్టుకున్నాడు.

రాజప్ప డెత్ నోట్ ఆదారంగా విచారణ జరిగింది. రాజప్పకు ట్రయల్ కోర్టు విదించిన జీవిత ఖైదు శిక్షను హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు కేఎస్. ఫణీద్ర, హెచ్.బి. ప్రభాకర్ శాస్త్రీ ట్రయల్ కోర్టు విదించిన శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు.

English summary
Karnataka High Court upheld the life sentence verdict by trail court against advocate SL Rajappa,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X