వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ లో సచిన్, ఇక్కడ నేనే హీరో, ఉప ఎన్నికల్లో కౌరవుడు ఘనవిజయం, ఆ కిక్కే వేరప్ప, హా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతోంది. 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో 12 శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ దూసుకుపోతుంది. హిరేకరూరు శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి, అనర్హత ఎమ్మెల్యే, కన్నడ సినీ హీరో బీసీ. పాటిల్ గెలుపొందారు. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఎలా హీరోనో తాను హీరేకరూరులో అలాగే హీరో, నేను మరోసారి ఎమ్మెల్యే అయ్యానప్ప, ఆ కేక్కే వేరప్ప, హా అంటూ బీసీ. పాటిల్ డైలాగ్ పేల్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీహెచ్. బన్నికోడ్ మీద పోటీ చేసిన బీసీ. పాటిల్ మొదటి రౌండ్ నుంచి దూసుకుపోయారు. చివరి రౌండ్ లో సైతం బీజేపీ అభ్యర్థి బీసీ పాటిల్ తన సత్తాచాటి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. బీసీ. పాటిల్ విజయం సాధించడంతో హీరేకరూరులో బీజేపీ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

మాజీ సీఎం నమ్మకద్రోహి

మాజీ సీఎం నమ్మకద్రోహి

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీసీ. పాటిల్ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మాజీ సీఎం సిద్దరామయ్య నమ్మకద్రోహం చేశారని, మంత్రి పదవులు ఇస్తామని మమ్మల్ని మోసం చేశారని, ఆయన నమ్మకద్రోహి అంటూ గతంలో బీసీ. పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.

నా సత్తా చూపిస్తా చూడు

నా సత్తా చూపిస్తా చూడు

హీరేకరూరు శాసన సభ ఉప ఎన్నికల్తో తన సత్తా చూపిస్తానని, మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని మొదటి నుంచి బీసీ. పాటిల్ చెబుతూనే ఉన్నారు. బీసీ పాటిల్ ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హీరేకరూరులో బీసీ. పాటిల్ విజయం కోసం స్వయంగా సీఎం. యడియూరప్పతో పాటు బీజేపీ నాయకులు రంగంలోకి దిగి చివరికి ఆయన్ను గెలిపించుకున్నారు.

ఊపిరి పీల్చుకున్న బీజేపీ లీడర్స్

ఊపిరి పీల్చుకున్న బీజేపీ లీడర్స్

ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ లో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్న సమయంలో బీజేపీ నాయకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కర్ణాటకలో కచ్చితంగా బీజేపీ నేతృత్వంలోని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, పూర్తి కాలం తామే అధికారంలో ఉంటామని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సీఎం యడియూరప్ప హ్యాపీ

సీఎం యడియూరప్ప హ్యాపీ

ఉప ఎన్నికల్లో ఒక్కో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తూ ఉండటంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఊపిరి పీల్చుకుంటున్నారు. తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంగా వెలుగు చూడటంతో సీఎం యడియూరప్ప ప్రత్యేక పూజలు చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇదే సమయంలో సీఎం యడియూరప్పకు శుభాకాంక్షలు చెప్పడానికి బీజేపీ నాయకులు క్యూ కడుతున్నారు.

షాక్ లో కాంగ్రెస్ లీడర్స్

షాక్ లో కాంగ్రెస్ లీడర్స్

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తాచాటుకోలేక చితకలపడింది. బీజేపీ అభ్యర్థులు ఒక్కొక్కరు విజయం సాధిస్తూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఢీలా పడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు ఆ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కనపడకపోవడంతో ఆ పార్టీ నాయకులు సైతం షాక్ కు గురైనారు.

English summary
Karnataka by elections results 2019: Know everything about Hirekeruru assembly constituency By election results. BJP BC Patil wins.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X