వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 12 కోట్ల కారులో వచ్చి వరద భాదితులకు రూ. 1 కోటి విరాలం, ఎంటీబీ రూటే సపరేటు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ మరో సారి వార్తల్లో నిలిచారు. రూ. 12 కోట్ల విలువైన ఖరీదైన కారు కొనుగోలు చేసి వరద భాదితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి రూ. 1 కోటి విరాలం ఇవ్వడానికి వచ్చారు. అనర్హత ఎమ్మెల్యే ఎంటీబీ. నాగరాజ్ అధికారికంగా రూ. వెయ్యి కోట్లకు పైగా ఆస్తి ఉందని గత ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు.

 బహిష్కరించిన కాంగ్రెస్

బహిష్కరించిన కాంగ్రెస్

మంత్రి పదవికి రాజీనామా చేసి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఎంటీబీ నాగరాజ్ అప్పట్లో మీడియాకు కేంద్ర బిందువు అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన హోసకోటే ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.

 రాజకీయాలకు గుడ్ బై

రాజకీయాలకు గుడ్ బై

అప్పటి కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ ఎంటీబీ. నాగరాజ్ మీద అనర్హత వేటు వేశారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని ఎంటీబీ. నాగరాజ్ కొంత కాలం క్రితం ప్రకటించారు. ఏదో ఒక విధంగా ఎంటీబీ నాగరాజ్ వార్తల్లో ఉంటున్నారు.

దుబాయ్ కారు

దుబాయ్ కారు

దుబాయ్ నుంచి సుమారు రూ. 12 కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ ప్యాంటమ్ కారు కొనుగోలు చేసిన ఎంటీబీ. నాగరాజ్ బుధవారం మరో సారి మీడియాకు కేంద్ర బిందువు అయ్యారు. రూ. 12 కోట్ల విలువైన విలాసవంతమైన కారులో బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అధికార నివాసం కృష్ణ దగ్గరకు చేరుకున్నారు.

రూ. కోటి విరాలం

రూ. కోటి విరాలం

కర్ణాటకలో భారీ వర్షాలు, వరదలతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భాదితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంటీబీ. నాగరాజ్ రూ. 1 కోటి విరాలం ప్రకటించారు. రూ. 12 కోట్ల విలువైన ఖరీదైన కారులో ఎంటీబీ. నాగరాజ్ ఆయన కుమారుడితో కలిసి వచ్చి సీఎం యడియూరప్పకు రూ. 1 కోటి చెక్ అందించారు.

ఫ్యాన్సీ లక్కీ నెంబర్

ఫ్యాన్సీ లక్కీ నెంబర్

ఎంటీబీ నాగరాజ్ ఆయన కారుకు కేఏ 59, ఎన్, 888 నెంబర్ రిజిస్ట్రేషన్ చేయించారు. కారుకు బెంగళూరులోనే ప్రత్యేకంగా పూజ చేయించిన ఎంటీబీ. నాగరాజ్ నేరుగా సీఎం యడియూరప్ప అధికారిక నివాసం దగ్గరకు చేరుకున్నారు. సీఎం యడియూరప్ప అధికారిక నివాసం దగ్గర ఉన్న అనేక మంది ఎంటీబీ. నాగరాజ్ కారు ముందు నిలబడి ఫోటోలకు ఫోజు ఇచ్చారు. చాల కాలంగా రోల్స్ రాయ్స్ కారు కొనుగోలు చెయ్యాలని ఆశగా ఉండేదని, అందుకే దానికి కొనుగోలు చేశానని ఎంటీబీ. నాగరాజ్ మీడియాకు చెప్పారు.

English summary
Karnataka Hoskote disqualified MLA MTB Nagaraj in news on August 14, 2019 after buying the Rolls Royce phantom car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X